బ్రిటీష్‌రాజ్యతంత్రము
65
దుష్పరి పాలన జరుగుచున్నదీ వీరుగమనింపరు. గమనించినను చర్య గైకొనరు. భారతదేశము తమ స్వంత జమీందారీ లేక జాగీరు అనియు అందలి వర్తకము వల్లనేగాక పరిపాలనవల్ల కూడా తమకు సరియైన లాభము రావలెననియు కంపెనీవారి యూహ. ధన సంపాదన కొరకు ఆనాడు ఎన్నో అన్యాయములు ఘోరములు మనదేశములో జరిగెను. క్లైవు, వారన్ హేస్టింగ్సులు దేశీయనవాబులకు రాజులకు గావించిన అన్యాయములు, చేసిన ప్రజాపీడనము బయల్పడినప్పుడు గూడ ఎట్టిచర్యయు గైకొనబడలేదు. భారతదేశములో నీమహానుభావులిరువురు చేయని నేరము లేదని ఒకచరిత్రకారుడు వ్రాసియున్నాడు. తమఅన్యాయములు కప్పిపుచ్చుకొనుటయేగాక తమ కుతంత్రములు సమర్ధించు కొనుటకు ఎన్నో దుస్తంత్రములు పన్ని తామెంతో ధర్మస్వరూపులమనియు ఈ దేశపు నవాబు లెంతో దుర్మార్గులనియు ఇంగ్లాండువారికి అబద్దములు గల్పించి చెప్పుచుండిరి. ఉదాహరణమునకు సురాజుద్దౌలాపట్ల వీరన్యాయము గావించి సురాజుద్దౌలా దుర్మార్గుడనియు అతడుచాలమంది ఇంగ్లీషు వారిని హింసించి చీకటి కొట్టులో పెట్టి తలుపు వేయగా ఆ వేసవిలో ఊపిరి తిరుగక నోరెండి చాలమంది దుర్మరణమునొందిరని కంపెనీవారు ప్రకటించిన కలకత్తా చీకటికొట్టు కథకూడా ఇటువంటిదే యని ఇటీవల చరిత్రపరిశోధకులు బయల్పరచియున్నారు, కంపెనీ డైరెక్టర్లకు పార్లిమెంటులో గొప్పపలుకుబడి యున్నందున భారతదేశములో తమ తాబేదారులు కంపెనీ లాభముకొరకు చేసిన ఘోరా