Jump to content

పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/554

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

64

భారతదేశమున


లెల్ల వారుచేయుచుండిరి. తమబలము, పలుకుబడి తుదకు రాజ్యాధికారముగూడ ఇందుకే ఉపయోగించిరి. ఎగుమతివ్యాపారములోనేగాక దేశములోని వర్తకములో ఉప్పు, పోకచెక్కలు, నల్లమందు మొదలగువస్తువులను ప్రత్యేకముగా తామొక్కరే వ్యాపారము చేయుహక్కును సంపాదించి దానివలన విశేషధనము ఆర్జించుచుండిరి. దేశములో తమకుగల రాజ్యాధికారము పలుకుబడి నుపయోగించి తమకు కావలసిన సరకులను తాముకోరిన ధరలకు విక్రయించవలసినదని దేశీయవర్తకులను పారిశ్రామికులను నిర్బంధించి క్రూరకృత్యములనుకూడ చేయుచుండిరి. దేశములోని కంపెనీనౌకర్లు క్రిందివానిమొదలు గవర్నర్లవరకుగూడా స్వంతవ్యాపారములు చేసికొనుచు విశేషలాభములు పొందుచుండిరి. అందువలన లంచగొండెతనము దుప్పరిపాలనము హెచ్చెను. దేశప్రభువులు వీరికీలుబొమ్మలై నందున ఈ దౌరన్యములకు అన్యాయములకు ఆలనపాలనలేదు. ప్రజల మొఱ లాలించువారులేరు. దేశములో వర్తకము ఆంగ్లేయులహస్తగతమాయెను. ఇతరులెవ్వరైన పోటీకి వచ్చినచో కంపెనీవారు దౌర్జన్యముగా వారినిహింసించి వారిసరకులను కాజేయుచుండిరి. కంపెనీప్రభుత్వమునందు. విచ్చలవిడిగా దోపిడిజరిగినదనుటలో అతిశయోక్తిలేదు. ఇంగ్లాండులోని డైరక్టర్లు ఎల్లప్పుడును సొమ్ము పంపమనికోరుచుండిరి. అందువలన సొమ్ము సేకరించుటకు కంపెనీవా రెన్నెన్నో దుర్మార్గములు చేయుచు ఎవరికిదొరికినదివారు కాజేయుచుండిరి. ఇంగ్లీషు డైరక్టర్లకుగావలసినది లాభముతప్ప వేరొకటిలేదు. దేశములోనెంత