పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/553

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బ్రిటీష్‌రాజ్యతంత్రము

63


విమర్శించువారెల్లరురాజద్రోహులు; దీనికొరకు కార్యశూరులై ప్రవర్తించువారెల్లరు అరాజకులు; దీనికొరకు సంఘబలమును చేకూర్చుకొన దలచువారెల్లరు విప్లవకారులు.

భారతదేశమున వర్తకము చేయవచ్చి ఈ దేశములోని రాజులలో మిత్రభేదముల గల్పించి రాజ్యమునాక్రమించి తామే పరిపాలకులైన ఆంగ్లేయ తూర్పు ఇండియావర్తకసంఘము భారతదేశమున సంపాదించిన పలుకుబడియు రాజకీయాధిపత్యమును అధికారబలమును భారతదేశ భాగ్యభోగ్యములు నింగ్లాండు లాభముకొరకు వినియోగించుటకొరకే ఉపయోగింపబడు బ్రిటిష్ రాజ్యతంత్రపద్దతి యానాడే ఆరంభమయ్యెను. ఈదేశమును పరిపాలించుటకు కంపెనీవారు నియోగించిన గవర్నరు గవర్నరుజనరలులయొక్కయు వారి చేతిక్రిందపనిచేయు తాబేదారీ ఉద్యోగులయొక్కయు. దుశ్చర్యలను బర్కు మున్నగు ధర్మవాదులు ఇగ్లాండు పార్లమెంటులో వారన్‌హేస్టింగ్సు విచారణసందర్భమున తెలియపరచియున్నారు. ఈ దేశమునుండి సంతతధారగా కోట్లకొలది ధనకనకవస్తు వాహనములను సీమకంపుటయే నాటి ప్రభుత్వవర్గమువారి ప్రధానకర్తవ్యముగ నుండెను. ఈదుష్పరిపాలనములోని అన్యాయములే 1857 నాటి విప్లవమునకు గారణమయ్యెను.

ఈదేశములోనికి అడుగిడిన నాటనుండియు తూర్పు ఇండియూవర్తకసంఘమువారి ప్రధానలక్ష్యము ధనార్జనము. వర్తకమువల్ల అమితలాభములార్జించుటకు వలసిన ప్రయత్నము