62
భారతదేశమున
తోను సత్యవ్రతముతోను ప్రపంచసమస్యలెల్ల పరిష్కరింప వీలుకలదా" యని దిగ్భ్రమజెందుచు భారతదేశ రాజకీయము లెల్ల ఈ పాశ్చాత్యజాతుల దృష్టిలో మెలగుచున్నందున బ్రిటీషువారీ అంతర్జాతీయ ప్రపంచరంగమున భారతదేశములో తమరాజ్యతంత్రమును సమర్ధించుకొనుట యవసరమయ్యెను. అందువలనగూడా ఈ కపటనాటకము నాడవలసి వచ్చెను. భారతదేశమున నీ మహాత్ముడు నీ కాంగ్రెసు నీ శాంతిసమరము నుండియుండనిచో సైమను నివేదికనాడే వీనికి మసిబూసి మారేడుకాయయనియుందురు. ఇప్పుడు కేవలము మసిమాత్రమేగాక బ్రిటీషువారు అతినిపుణతతో తయారుచేసిన చక్కని కృతిమపు రంగులుగూడ పూయవలసివచ్చెను. అందుకే ఈ రాజ్యాంగచట్టము నిర్మించుట కిన్నేండ్లు పట్టినది.
మూడవ పరిచ్ఛేదము:
బ్రిటిషు రాజ్యతంత్రముయొక్క ఆర్థిక ఫలితములు
I
ఇంగ్లీషువారీదేశములో అడుగు పెట్టినది లాభము సంపాదించుట కొరకు; వా రీదేశము నాక్రమించినది. లాభము నార్జించుటకు; వారీదేశమును పరిపాలించునదియుగూడఅందుకే. ఈ సంగతి గడచిన 175 సంవత్సరముల బ్రిటీషు రాజ్యతంత్రచరిత్రవలన జగద్విఖ్యాతమైనది. 1935 లో నూతన రాజ్యాంగ చట్టము వలన నీసంగతి యిక దాచనవసరము లేని రాజనీతిగా సూత్రీకరింపబడినది. ఈ అన్యాయపు రాజనీతిని తిరస్కరించి