Jump to content

పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/551

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బ్రిటీష్‌రాజ్యతంత్రము

61


తీయప్రజలెల్ల రేకగ్రీవముగా కోరుచున్న స్వరాజ్యమును గూడమఱచి, బ్రిటీషు ప్రధానామాత్యుని మధ్యస్థునిగా నేర్పరచుకొని ప్రత్యేక నియోజకవర్గముల నేర్పరచుకొనుటయు రౌండుటేబిలుసభ రసాభాసముకాగా మహాత్ముడింటికి మరలుటయు నిక్కడ కాంగ్రెసు నణగద్రొక్కుటయు జరిగినది. బ్రిటీషువారు కుటిలరాజ్యతంత్రము ప్రయోగించి సఫలమనోరథులై రెండవ రౌండుటేబిలు సభలోని స్వార్థపరులమాటలు చర్యలు ప్రపంచమునకు చాటి, “చూచితిరా మేమెంత ధర్మాత్ములమో! గాంధిమహాత్ముని మాటకూడ వినక పోరాడుకొను వివిధపక్షములు భారతదేశములోకలవు గనుకను వారిని మేము తప్ప భారతజాతీయ ప్రజాప్రభుత్వములు రక్షింపలేవు గనుకను అందుకుకుతగిన బందోబస్తు లెల్ల మేముచేసి వానిని పరిపాలించుటకే మేమచ్చట శాశ్వతముగా ప్రభుత్వము చేయదలచినా"మని ప్రకటించి ధైర్యముతో నీ చట్టములోని విపరీతపుపుటన్యాయ నిబంధనలు శాసించిరి.

బిటీషువారీ నాటకమునెల్ల ఎందు కాడవలసివచ్చినది? అనుదాని కింకొకకారణముకూడకలదు. గాంధిమహాత్మునికి ప్రపంచములో చాలా గౌరవమును, పలుకుబడియు కలవు. ఆయన నాయకత్వమున కాంగ్రెసు చాలా బలవంతమైన రాజకీయసంస్థయై, నూతనపద్ధతులతో స్వాతంత్ర్యముకొరకు శాంతిసమరము చేయుచున్నది. ఈవిచిత్ర స్వతంత్ర పోరాటమును ప్రపంచజాతులెల్ల ఆశ్చర్యముతో చూచుచు, “ నిజముగా యుద్ధములులేకుండా హింసలేకుండా అహింస