బ్రిటిష్ రాజ్యతంత్రయుగము
31
వలసిన సొమ్మును గడువులోపల నిచ్చుకొనుట కీ నవాబు తక్కినవారివలెనే పెద్ద వడ్డీ కప్పు పుచ్చుకోవలసి వచ్చుచుండెను. మరియు నా రాజ్య భాగములందలి శాసన ధర్మవిధులు కంపెనీవారి ఫోర్టుసెంటుజార్జి కోటలోని సివిలు మిలిటరీ యాంగ్లేయ జనులనలన నిర్మింపబడి అమలు జరుపబడుచుండెను. ఇందువలన అనర్థకము లసంఖ్యాకములుగ నుండెను. 1792 సంవత్సరపు సంధిషరతులు అమలు జరుగ నారంభించినది మొదలు పెన జెప్పిన అనర్థకములను సంస్కరించుటకును, కంపెనీవారి ఆదాయమును బందోబస్తు చేసికొనుటకును వలసిన మార్పులను చేయవలెనని ప్రతి గవర్నరును నవాబును కోరుచుండెను గాని నవాబు దీని కంగీకరింపలేదు. ఈ పద్ధతినలన దేశాదాయము క్రమక్రమముగా క్షీణించిపోవుచుండెను. ప్రజాపీడన మధికమై ప్రజలలో అశాంతి ప్రబలుచుండెను. ఇట్టిస్థితిలో కంపెనీవారికి టిప్పుసుల్తానుతో యుద్దము తటస్థించెను. అంతట వెలస్లీ యీ కర్నాటకమును బ్రిటిషురాజ్యములో కలుపుకొనదలచెను. దానికొక నెపము సులభముగనే దొరికెను. ఈ కర్నాటకనవాబు తన ప్రక్క రాజగు టిప్పుతో నుత్తరప్రత్యుత్తరములు జరుపుచున్నాడనియు ఇవి సంధి షరతులకు భంగకరమనియు నందువలన కంపెనీవారు తమ క్షేమముకొరకు వలసినచర్య గైకొనుట కర్హులనియు . నిర్ణయించి పైనచెప్పిన ప్రకారము కర్నాటక నవాబును మనువర్తిదారుగ జేసివైచెను.