బ్రిటీష్‌రాజ్యతంత్రము
59
చేసికొని తీరవలెను. బ్రిటీషువారికి నష్టకరమైన ఎట్టిశాసనములుగాని చేయుటకు భారతీయుల కావంతయైన అవకాశము అధికారము నుండరాదు. ఈయుద్దేశ్యము నెరవేరవలె నన్నచో నిజమైన అధికారములు భారతదేశపు ప్రజాపతి నిధులకిచ్చుటకును వీలులేదు. తాముచేసిన వాగ్దానము చేయకుండ పోయిరను అపవాదు రాకుండా ఏవోకొన్ని సంస్కరణములు జేసినట్లునుండవలెను; నిజముగా తమవాగ్దానము చెల్లింపనురాదు. భారతదేశమునకు బాధ్యతాయుత ప్రజాప్రాతినిధ్య పరిపాలనము కొంతప్రసాదించినట్లు కనబడవలె; నిజమైన ప్రజాప్రభుత్వపద్ధతులు, అధికారములును ఆప్రభుత్వమునకు నుండరాదు. ఇట్టి పరస్పరవిరుద్ధములైన ఉద్దేశ్యములను లోపల పెట్టుకొని రాజ్యాంగమును నిర్మించు టెంతకష్టము! ఇదియెల్ల కేవలము నిరంకుశముగా చేసినట్లు ప్రపంచము గ్రహింపకుండ భారతీయులలో కొందరిని చేరదీసి వారితో ఆలోచించినట్లు నటించి వారియిష్టముతోనే యీరాజ్యాంగమును తాము నిర్మించితిమని ప్రపంచమునకు చాటుటకునుగూడ ఈతంత్రమెల్ల పన్న బడినది.
కేవలము స్వలాభముకొరకు పర రాజ్యాక్రమణము చేయదలచిన ఐరోపాజాతివారగు ఇటలీవారుగూడ తామాక్ర మింపదలచిన అబిసీనియా దేశములోని వారి అనాగరికతను తొలగించి వారినుద్దరించుట కే వారి రాజ్యమును తాము వశపరచుకొనుచున్నామని ఇటీవల ప్రకటించుట జగత్ప్రసిద్ధము. అట్లే బ్రిటీషువారుకూడా తమకు బానిసగానున్న ఈపాలిత