బ్రిటీష్‌రాజ్యతంత్రము
55
ఇంతటితో నింకొకరంగము ప్రారంభమైనది. 1932 లో గాంధిమహాత్ముడు కాంగ్రెసుప్రతినిధిగా నింగ్లాండుకు వెళ్లెను. అచ్చట ఆయనకు అఖండమైన స్వాగత మివ్వబడెను. ప్రపంచములోని గొప్పవారెల్లరు నాయనను గౌరవించిరి. అంతట నాయన రౌండుటేబిలు సభలో కాంగ్రెసుయొక్క ఉద్దేశ్యములను భారత దేశప్రజల కోర్కెలను నిర్భయముగా వివరింపసాగెను.
ఇంతలో నింగ్లాండులో లేబరుప్రభుత్వము పోయి భారతదేశస్వాతంత్వనిరోధులగు కన్సర్వేటివులు, ప్రభుత్వమునకువచ్చి కుటిలనీతిని, మిత్రభేదమును ప్రయోగించి రెండవరౌండుటేబిలు కాన్ఫరెన్సును విఫలముజేసి భారతదేశమును శాశ్వతదాస్యమున నుంచుటకు బద్దకంకణులై ఒక అంతర్నాటకమును ప్రయోగింప సమకట్టిరి. భారతదేశమునకు స్వరాజ్యార్హత లేదని వాదించు నింగ్లాండులోని కన్సర్వేటివు ప్రతినిధులను రంగములో ప్రవేశపెట్టి వారిచేత గొప్పఆందోళన చేయించిరి. భారతీయులలో కాంగ్రెసు గాక తక్కినపక్షములవారితరఫున ఆహ్వానింపబడిన కీలుబొమ్మలలో కొందరు స్వార్థపరులనుచీలదీసి విడదీసిపాలించుచాణక్య నీతిని ప్రయోగించి వారిజాతిమతకులాభిమానములను ప్రజ్వలింపజేసి ఆస్వార్ధపరులచేత రౌండుటేబిలుసభాస్థలిలోనే బహిరంగముగా కాంగ్రెసునెడలను తుదకు గాంధిమహాత్మునియెడలను గూడ తమకు విశ్వాసములేదనియు, జాతీయవాదులతో తమకుసంబంధములేదనియు, తామల్పసంఖ్యాకులనియు, తమకు