పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/544

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

54

భారతదేశమున


ఎదుర్కొనిరి. ఈ జాతరనుజరపి ఈ కమిటీవారిని పోలేరమ్మను సాగనంపినట్లు పంపిరి.

1929 సంవత్సరము డిసెంబరు 31 తేదీన కాంగ్రెసువారు పూర్ణస్వాతంత్ర్య తీర్మానమును గావించిరి. భారత దేశదారిద్ర్యము మాన్పుటకు కొన్ని సంస్కరణములనైన ముందుగా చేయుడని మహాత్ముడుకోరినను బిటీష్‌వారు వినలేదు. అంతటపూర్ణస్వరాజ్యముకొరకు 1930 లో శాసనోల్లంఘనము ప్రారంభింపబడగా 60 వేలమంది చెరకేగుటతో, లాటీప్రయోగముతో, కాల్పులతో సైనికశాసనము వంటి తీవ్రనిర్బంధవిధానము ప్రయోగించిరి. ఇట్లు కాంగ్రెసు నణచియుంచి తమకు తోచిన రాజ్యాంగసంస్కరణల జేయుటకు ఆలోచించుటకని బ్రిటీష్‌పభుత్వమువారు ఒక రౌండుటేబిలు సభను ఏర్పాటుచేసి తమకు దాసానుదాసులగువారిని ఆ రౌండుటేబిలు బొమ్మలకొలువులో గూర్చుండబెట్టి చర్చలుజరిపి మినహాయింపులు రక్షణలుగల బాధ్యతయుత పరిపాలనమును భారతదేశమునకివ్వవలె నని తీర్మానముచేయించి ఒక రాజ్యాంగప్రణాళిక తయారుచేసిరి. ఆనాడు ఇంగ్లాండు ప్రభుత్వము నిర్వహించుచుండిన లేబరుపక్షమువారు కాంగ్రెసు లేనిది భారతదేశ సమస్య పరిష్కరించలేమని తుదకుగ్రహించి ఆనాటి రాజప్రతినిధి ఇర్వి౯ ప్రభువుద్వారా కాంగ్రెసుతో ‘గాంధి ఇర్వి౯' రాజీజేసికొని రెండవరౌండుటేబిలుసభ సమావేశపరిచి దానికి కాంగ్రెసు నాహ్వానించిరి.