పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/543

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బ్రిటీష్‌రాజ్యతంత్రము

53


దేశమున క్రమక్రమముగా బాధ్యతాయుత పరిపాలనము స్థాపించెదమని బ్రిటీషువారు పొరబాటున 1919 సంవత్సరపు రాజ్యాంగచట్టఉద్దేశ్యములోనే వివరించి యుండిరి. మఱియు పదేండ్లలో రాజ్యాంగసంస్కరణలనుగూర్చి విచారింతుమనియు అందు నిర్ణయించియుండిరి. 1928 నాటికి ఆగడువు కాలము దగ్గరించినది. అందువలన రాజ్యాంగ సంస్కరణలనుగూర్చి ఏదోవిచారణను కొంతచేసితీరవలెను. అయితే ఈవిచారణ ఫలితముగా ఏమైన రాజ్యాంగసంస్కరణ చేయునది లేనిది బిటీషువారి యిష్టములో నుండును. బిటీషువారికి నిజముగా మనకు స్వరాజ్య మివ్వవలెనని లేదు. అందువల్లనే తాము 1919 లో చెప్పిన బాధ్యతాయుతపరిపాలన మనగా అధినివేశస్వరాజ్యము కాదని బ్రిటీషురాజనీతిజ్ఞు లప్పుడే వాదింపసాగిరి. అంతట దేశమున తీవ్రఅసమ్మతి కలుగగా బ్రిటీష్ వారు నీఅపోహలు రాజప్రతినిధిద్వారా మఱల తొలగించిరి. రాజ్యాంగ వ్యవహారములనుగూర్చి విచారణచేయుటకు పార్లమెంటువారు సైమను కమిటీని నియమించిరి. దీనితో బిటీష్ రాజ్యతంత్ర నాటకములో రాజ్యాంగ సమాలోచనఘట్టమును అంతర్నాటకములును ప్రారంభమయ్యెను. డేశములో ఈ తెల్ల కమిటీపట్ల తీవ్రఅసమ్మతికలిగెను. అందువలన సైమనుగారు ఇంగ్లీషు సభ్యులతో పాటు కొందరు భారతీయ కీలుబొమ్మల ఉపసంఘములు ఏర్పాటుచేసి వారితో కూడా రంగమున బ్రవేశించిరి. వారికివ్వబడిన నల్లజెండాల తిరస్కార స్వాగత హర్తాళములను 144 వ శెక్షనులతోను, లాటీచార్జీలను