30
భారత దేశమున
'శాశ్వతసంధి'పత్రనియమములు గూడా అవి పరిపాలించుట యవసరమని తమకు తోచినంతకాలమే గాని, తరువాత తాము మన్నింపవలసిన పనిలేదని ఈ గవర్నరు జనరలు సూత్రీకరించెను.
బ్రిటిషువారితో సంధిచేసికొనిననవాబు 1792 లో చనిపోగా ఆనాటి పరిస్థితులనుగూర్చి మిల్లు తన బ్రిటిషుఇండియా చరిత్రలో నిట్లు వ్రాసినాడు “అయోధ్యయు కర్నాటకమును పూర్వము చాల భాగ్యవంతములైన రాజ్యములు. బ్రిటిషు ప్రభుత్వముయొక్క పలుకుబడి క్రిందికి వచ్చినతరువాత దుష్ట పరిపాలనవలన భారతదేశములోని తక్కిన ఏభాగమునను గానరాని దౌర్భాగ్యస్థితికి వచ్చినవి. వీనిదుస్థితికి ప్రపంచములోని ఏ భాగమునను పోలికలేదు. ఈ ఘోరస్థితి బ్రిటిషు సంపర్క మువలన నెట్లు గలిగినది ?” (Mill's History of British India Book VI. 51-52.) ఈ ప్రశ్నకు జబాబు 1792 లో నవాబుతోడి సంధినిగూర్చి వెలస్లీ పరిపాలనకాలమునాటి చరిత్రకారుడగు వెల్లింగ్ట౯ వ్రాసిన మాటలలోనే కనబడును. బ్రిటిషువా రిండియాలో చేసిన ఈమాదిరి సంధు లన్నిటియందు వలెనే ఈ సంధియందుకూడ నొక్క ప్రధానమగు అనర్థకముకలదు. నవాబుయొక్క ఆంతరంగిక వ్యవహారములలో కంపెనీవా రెట్టి జోక్యము కలిగించుకొనరాదను నొక నియమముకలదు గాని ఈపరిపాలనను నిలిపియుంచుటకొర కీ కంపెనీ వా రెల్లప్పు డేదో జోక్యము కలిగించుకొనుచునే యుండిరి. ఇంకొక ముఖ్యమైన అసర్ధక మేమనగా కంపెనీవారి కిచ్చుకొన