పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/538

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

48


రెండవ పరిచ్ఛేదము : బ్రిటీష్ రాజ్యతంత్రపరిణామము

I

"తూర్పుఇండియా వర్తకసంఘమువారు భరతఖండమున వర్తకముచేయుకొరకు కట్టుకొనిన గిడ్డంగులు కోటలయ్యెను. కోటలు సైనిక నివహముల కాలవాలమగు దుర్గములయ్యెను. సైనిక నిచయములు సామ్రాజ్యసంపాదనకు సాధనములయ్యెను. ఈయారోహణము మెల్లగా, సహజముగా అనివార్యముగా జరిగిన రాజ్యతంత్రముయొక్క పరిణామము" అని తూర్పుఇండియావర్తకసంఘమువారి కొలువులోనే పనిచేసిన ఉద్యోగియగు ఫిలిప్ ఫ్రాన్‌సిస్ 1787 లో వ్రాసియున్నాడు. భారతదేశమునందు బ్రిటీష్ రాజ్వతంత్రముయొక్క చరిత్రను క్లుప్తముగా ఒక్కవాక్యములో చెప్పవలెనన్నచో పైనచెప్పినదానికన్న చక్కగా నెవ్వరును చెప్పజాలరు. 1858 వ సంవత్సరమువరకును ఇంగ్లీషువారీదేశములో పన్నినతంత్రములు చేసినచర్యలు అన్నియుగూడ ఈదేశమున రాజకీయార్థిక ఆధిపత్యమును చేజిక్కించుకొనుటకొరకే చేసిరి. ఈబ్రిటీష్ రాజ్యతంత్రప్రభావమువలన భారతదేశభూభాగములో మూడింట రెండువంతులు బ్రిటిష్‌ఇండియా యైనది. తక్కిన మూడవవంతునందలి రాజులు బ్రిటీషువారికి లోబడి స్వదేశసంస్థానములైనవి. అంతట దేశపరిస్థితులు తారుమారైనవి. వర్తకముకొరకువచ్చి మనరాజుల నాశ్రయించినవారే మనరాజులకు రారాజులైరి. ఇట్లు దేశమునెల్ల ఆక్రమణచేసి రాజ్యాధిపత్యమును సంపాదించి రాజకీయార్థిక సామ్రాజ్యమును