బ్రిటీష్‌రాజ్యతంత్రము
47
యున్నవి. ఈ కార్యములెల్ల జయప్రదముగా నెరవేర్చవలెనన్నచో నీ మంత్రులు, ఈ కార్యదర్శులు, నీ శాసనసభ్యులు కాంగ్రెసుసంఘముల సామాన్యకాంగ్రెసు సభ్యులుకూడ కలసి కష్టపడి పనిచేయవలెను. అంతేకాని ఒకరిసాయము మనకేలయనిగాని, వారికి మనమేల సాయము చేయవలెననిగాని యుపేక్షింపరాదు. కాంగ్రెసు పతాకముక్రింద పనిచేయువారెల్లరు, మంత్రులైనను, కార్యదర్శులైనను, శాసససభ్యులైనను, కాంగ్రెసుసంఘముల పాలకవర్గమువారై నను ఊరుపేరులేని కాంగ్రెసు వాదియైనను, సత్యాగ్రహమువలెనే ఈ ప్రభుత్వ నిర్వహణముగూడ భారతదేశప్రజల దారిద్ర్యనివారణకొఱకు , పూర్ణస్వాతంత్ర్యస్థాపనకొఱుకు గాంధీమహాత్ముని నాయకత్వమున జరుపబడుచున్న మహాయజ్ఞమేయనియు దీనిని జయప్రదముగా నిర్వహించి దేశఋణము తీర్చుకొనవలయుననియు గ్రహించి త్రికరణశుద్ధిగా నందుకొరకు దీక్షవహించి ఈ కాంగ్రెసు పతాకముయొక్క అంతరార్ధగుణములగు త్యాగధైర్యశాంతి సత్యసాహసౌదార్య ధర్మములతో స్నాతకులై తరలవలెను. ఈ స్నాతకుల కెల్లరకు తైత్తితరీయోపనిష త్తులోని వాక్యమును జ్ఞాపకముచేయ సాహసించుచున్నాను. “సత్యముతప్పకుడు; ధర్మమువీడకుడు; క్షేమకరములగు మార్గములనే చరింపుడు." వందేమాతరం!