Jump to content

పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/536

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

46

భారతదేశమున


మార్చి ఎగుమతిచేయుచు మనము సులభముగా చేసికొనలేని వస్తువులను మాత్రమే దిగుమతి చేయవలెను. ఇందులకువలసిన కార్ఖానాలు యంత్రాలయములు స్థాపించి నడుపవలెను. .

అర్థోత్పత్తియందు వాణిజ్య వ్యవసాయ పరిశ్రమలందు సమష్టికృషి సమష్టిప్రయత్నము సమష్టి లాభమునుగల సహకార పద్ధతులను ప్రజలయందు వ్యాపింప జేయవలయును.

దేశప్రజల జవసత్వముల నభివృద్దిగావించి జీవనాధార సౌఖ్యములు, ఆరోగ్యము కలిగింపవలెను. ఇతరదేశములందు వలెనే ఆరోగ్యనూత్రములను రోగనివారణోపాయములను బోధింపవలెను. రోగచికిత్స కుచితవైద్యసహాయము గావింపవలెను. జబ్బుపడిలేచినవారికి విశ్రాంతిగృహములను ఉచిత జీవనోపాధియు కలిగింపవలెను. అనాధలకు, అశక్తులకు, వృద్దులకు, దరిద్రులకు, బాలబాలికలకు , ప్రసూతిస్త్రీలకు, వ్యాధిగ్రస్తులకు దారిద్ర్యమున మరణింపకుండుటకు వలసిన జీవనభృతి, ఉపకారవేతనములు, ఇతర సాహాయ్యమును గావింపవలెను.

ఈసంస్కరణల నెల్ల చేయుటలో మనమంత్రులు తమ క్రిందియధికారులు తాము నిర్ణయించిన విధానముల నెల్ల చక్కగా నెరవేర్చుచున్నారో లేదో అందలి లాభములు జన సామాన్యములు పొందగలుగుచున్నారో లేదో కూడా కని పెట్టుచుండవలెను.

ఇట్లు భారతదేశప్రజల క్షేమ లాభములకొరకు నేడు కాంగ్రెసుమంత్రులు చేయవలసిన పనులు లెక్కకు మీరి