Jump to content

పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/535

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బ్రిటీష్‌రాజ్యతంత్రము

45


పద్ధతులు, పౌరస్వత్వపద్ధతులు ఈమార్గములద్వారా వెంటనే బోధించవలెను.

దేశసంపద నభివృద్ధిచేయుటకును ప్రజల ఆదాయమును హెచ్చు చేయుటకును ప్రయత్నించవలెను. వ్యవసాయము నందు నూతనపద్ధతు లవలంబించవలెను. సాగు చేయవలసిన భూమినంతయు సాగుచేయవలెను. పల్లపు సాగుకొరకు నీటిపారుదలను వృద్ధిచేయవలెను. మంచి ఎరువులు పరికరము లుపయోగించవలెను. లాభకరములగు క్రొత్త పంటలను వేయుట మొదలిడవలెను. పంటలను నిలువజేసి లాభసాటి ధరలకు విక్రయించుట కవకాశము కలిగింపవలెను. వ్యవసాయపుపనులకు వలసిన ధనమును చౌకవడ్డీలకు సులభసాధ్యము చేయవలెను. రైతులు కోర్టులలో దిగి పాడుకాకుండ మాధ్యస్థ తీర్మానపధ్ధతి ప్రారంభింపవలెను. సంవత్సరము పొడుగున పని లేనికాలమును వ్యర్ధపరచు రైతులకు వారి కుటుంబములకు తీరిక వేళలందు పనికలిపించి వారి యాదాయమును వృద్ధిపరుపగల పాడిపంటలకు సంబంధించిన పరిశ్రమలు, అనుగతగృహ పరిశ్రమలు, చేతిపనులు నెలకొల్పవలెను.

దేశములోని ముడిపదార్థములను ఖనిజజంతువృక్ష సంబంధపుటుత్పత్తులను పాడిపంటలను పుట్టినవి పుట్టినట్లు విదేశములకు ఎగుమతిచేసి అధిక వెలలకు వానినే తయారువస్తువులుగా దిగుమతి చేసికొను పద్ధతిమాని నిర్మాణ కౌశలము చేతను, మానవ పరిశ్రమ వలనను, యంత్ర సాహాయ్యమునను సరకులనెల్ల కొంచముగనో గొప్పగనో నిర్మాణ వస్తువులుగ