Jump to content

పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/534

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

44

భారతదేశమున


ద్రవ్యము కర్చుపెట్టుచున్నందున పన్ను లొకభారముగా లేవు. ప్రజారోగ్యమును కాపాడుటకు ఆసుపత్రులును విరివిగా స్థాపించబడినవి.

1918 వ సంవత్సరపు విప్లవమువలన అంతకుపూర్వము ధనికులవశమున నుండిన 15 కోట్ల యెకరముల భూమి రైతులకొరకు సాగుచేయబడుచున్నది. దేశములో సంఘ స్వామ్యపద్ధతి స్థాపింపబడి, వివిధ కుటుంబములు కలిసి చేయుసమష్టి కృషి, ట్రాక్టరు యంత్రకృషిపద్దతియు స్థాపింప బడినవి. ఇతర దేశములందు వాణిజ్యవ్యవసాయ పారిశ్రామిక వృత్తులం దుపయోగింపబడు సహకారపద్దతులెల్ల పరిపూర్ణముగా సంస్కరింపబడి రాజకీయార్థి కవిషయములు సమన్వయము చేయబడిన సర్వసమానకర్మకర సహకార సంఘస్వామ్యము స్థాపింపబడినది. పైపద్ధతులనెల్ల మనదేశమునగూడ నెలకొల్చవచ్చును.

మనకాంగ్రెసు మంత్రులు దేశదారిద్ర్యము మాన్పుటకు చేయవలసిన ప్రథమచికిత్స గాఢముగా దేశము నావరించియున్న అవిద్యాంధకారమును తొలగించుటయే. అట్లుచేసిననే ప్రజలు కన్నులుతెరచి తమ దుస్థితిని, ప్రపంచములోని అభివృద్ధిని, గాంచి బాగుపడుటకు ప్రయత్నింపగలరు. పాఠశాలలు, గ్రంథాలయములు ఉపన్యాసములు, సినీమా, రేడియో ప్రదర్శనములు మొదలగు సమస్త నూతన సాధనములచేతను విద్యావ్యాప్తి గావింపవలెను. ప్రభుత్వోద్యోగు లెల్లరు ప్రజల కీవిషయములను బోధింపవలెను. ప్రజలకు శౌచ