బ్రిటీష్‌రాజ్యతంత్రము
43
లందు, పట్టణములందు నున్న పారిశ్రామికుల క్షేమ లాభముల కొరకే అన్నిపనులు నిర్వహింపబడుచున్నవి. పొరబాటు లప్పుడప్పుడుజరుగుచున్నను మొత్తముమీద జనసామాన్యముయొక్క సమష్టి క్షేమలాభములకొరకే సర్వకార్యములు నిర్వహింపబడుచున్నవి. చిరకాలమునుండి జనులుపడియున్న అధోగతినుండి, వారిని పైకిదీసి ఉద్దరించుకొరకు, ఆధునిక జ్ఞానమునందు వారినిగూడ భాగస్వాములుగా జేయుటకు ప్రయత్నములు జరిగినవనుటకు సందియము లేదు. పుస్తకములు, కరపత్రములు, వార్తాపత్రికలు వారికొరకు ఏటేటను లెక్క లేనన్ని ప్రకటింపబడి పంచిపెట్టబడుచున్నవి. వారిపిల్లలకు చదువుచెప్పుటకు పాఠశాలలును, యువకులకు సాంకేతికవిద్య, వృత్తివిద్య నేర్పు పాఠశాలలును, నెలకొల్పబడినవి. దేశమందంతటను ఉపన్యాసము లొసగబడుచున్నవి. విజ్ఞానము నలుగడల వ్యాపించుచున్నది. అవిద్య తొలగిపోవుచున్నది. పైతరమువారుకూడా విద్యావంతు లగుటకొరకు వయోజనవిద్య స్థాపింపబడినది. స్త్రీలుకూడ పురుషులతో పాటు తుల్యులుగా నెంచబడుచు దేశనాగరకతయందు సభ్యత కలిగియున్నారు. దేశములోని అన్ని పరిపాలనశాఖలయందును స్త్రీలు నియమింపబడి, దేశముయొక్క రాజకీయ సాంఘికఆర్థికపురోభివృద్ధికి తోడ్పడుచున్నారు.
సోవియటు ప్రభుత్వము పశుజాతిని కోళ్లువగైరా పక్షిజాతిని ప్రశస్తతరముగా జేసినది. శాస్త్ర పరిశోధనలను ప్రయోగములను జనసామాన్యమునకు తెలియజెప్పుటకు లెక్క లేనంత