42
భారతదేశమున
తమ శాస్త్రజ్ఞానమును ప్రజలకు బోధించుచుందురు. అనేక వస్తుప్రదర్శనములు, పారిశ్రామిక ప్రదర్శనములు జరుపబడు చుండును. చిత్రవస్తు ప్రదర్శనాలయములు, గ్రంథాలయములు విరివిగా స్థాపింపబడినవి. రేడియో దూరశ్రవణ యంత్రములద్వారా విద్యాప్రచారము గావింపబడుచున్నది. యుద్ధపూర్వము నూటికి తొంబదిమంది నిరక్షరులుగానున్న రష్యాలో నిప్పుడు నూటి కెనుబదిమంది విద్యావంతులుగా నున్నారు.
ఇంకొక విశేషమేమన ప్రతిపట్టణములోను, ఒక ధర్మపు క్లబ్బు, పఠనమందిరము నెలకొల్పబడినవి. వానినంటి యొక విచారణమందిరముండును. అచ్చట బాలురు, వృద్ధులు, రైతులు, కార్మికులు, వీరువారను తారతమ్యము లేకుండ, ఎల్లరును తమకు గావలసిన సమస్త విషయములనుగూర్చి యడిగి తెలిసి కొనవచ్చును. టైము ఎంత? రైలు ఎన్నిగంటలకు బయలుదేరు ననుప్రశ్నలు మొదలు ప్రపంచవార్తలు, శాస్త్రవిషయములు సైతము అడిగిన వారికి చెప్పవలసినదే!
పైన చెప్పబడిన విషయములందెల్ల పురుషులతోపాటు స్త్రీలును సమానాధికారము, అవకాశములుకలిగి అభివృద్ధి గాంచుచున్నారు.
దాసవృత్తియందుపడి, ధనికులలాభముకొరకు కష్టించు రోజులుపోయి రష్యాదేశపురైతులు సోవియటు సార్వజనిక , ప్రభుత్వాధికారు లైనారు. ప్రభుత్వోద్యోగుల నెన్నుకొనుటలో రైతులకు పలుకుబడి, వోటుకూడ కలదు. గ్రామము