Jump to content

పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/527

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బ్రిటీష్‌రాజ్యతంత్రము

37


వలన నేటిమంత్రు లిప్పటికైనను తమధర్మమునుగుర్తెరిగి దేశ సమస్యలెల్ల పరిశీలించి ప్రజల క్షేమలాభములకు వలసిన సంస్కరణలెల్ల చేయుటయేగాక అవి అమలుజరుగుచున్నదీ,. లేనిదీ కనిపెట్టి చూడవలెను. ఇట్లు తల్లి శిశువును సంరక్షించునట్లు మంత్రులు ప్రజలను కాపాడి పరిపాలించవలెను. లేనిచో నీ నోరులేనిప్రజలు మఱల అజ్ఞానమున, భయమున మునిగి పైకిరాలేక అగాధములో పడిపోవుదురు.

V

కాంగ్రెసుమంత్రుల కర్తవ్యములు

కాంగ్రెసుప్రభుత్వము చేయవలసిన మొదటిపని, యీ ప్రజల అవిద్యాంధకారమును తొలగించుటకు తన సర్వశక్తుల నుపయోగించుట. తమకు కొన్నిహక్కులు కలవను జ్ఞానము ప్రజలకు కలిగింపవలెను. ఇది చేయనిచో నీ ప్రభుత్వము వలని లాభము ప్రజలు పూర్తిగా పొందజాలరు. జిల్లాలోని వివిధశాఖల అధికారులెల్లరు వేలకువేల రూపాయిలు జీతబత్తెములుగా పుచ్చుకొని, ప్రజలపైన నిరంకుశాధికారము చలాయించుచు, దర్బారులలోని నవాబులవలె ప్రవర్తించు చున్నారు. ఉద్యోగ హోదాలోనుండు భారతీయులుగూడా “దొర"గారని పిలిపించుకొనుచు, పాటకపుజనముయొక్క కష్టసుఖములు తెలిసికొని వారి బాధలు నివారణచేయకపోవుట యట్లుండ వారితో మాటలాడక వారిని తమ బంగాళాదగ్గరకు