36
భారతదేశమున
వారికి గూడ వోటుహక్కు కలుగుట అనగా తమ యభిప్రాయానుసారముగా ప్రవర్తించి తమక్షేమలాభములకొరకు ప్రభుత్వము నడుపగల ప్రతినిధుల నెన్నుకుని వారిచే పరిపాలన జేయించుటయే యనియు ప్రజలెల్లరు గ్రహించునట్లు చేయవలెను.
ఈప్రభుత్వము తమదేయనియు, పూర్వము తమపై స్వారిచేయుచుండిన నిరంకుశాధికారులు, కలెక్టరులు, తహ్సీలుదారులు, మేజస్ట్రీటులు, పోలీసువారు, ఇప్పటినుండి తమకు సేవకులై మెలగవలసియున్నదనియు ఇందుకు వ్యతిరేకముగా ప్రవర్తించినచో వారిని తాము దండింపవచ్చుననియు, ప్రజలు తెలిసికొనునట్లు చేయవలెను. దేశముయొక్క భాగ్యభోగ్యములెల్ల జనసామాన్యము అనుభవించుటకు హక్కుకలదనియు - విద్యావైద్యసహాయములు చేయుడని, అజ్ఞానముబాపుడని, దారిద్ర్యము మాన్పుడని ప్రభుత్వవర్గమును కోరుటకు తమకధికారముకలదను సంగతి నీ ప్రభుత్వమంత్రులు ప్రజలకు స్పష్టముగా చెప్పవలెను. దేశము నావరించియున్న ఈగాఢమైన అవిద్యాంధకారము ప్రజల నావరించియున్న అధికారులను జూచిన భయము పోయినగాని ప్రజలకు కలిగిన స్వల్ప అధికారములు ఈవోటు హక్కులు వారు తమలాభముకొరకు వినియోగించుకొని బాగుపడజాలరు. అవియన్నియు ధనికులకే లాభము కలిగించునుగాని బీదలకు లాభింపవు. కూలివాడు ఎప్పటికిని , కూలివాడుగానే యుండును గాని ప్రభుత్వమును నడుపగల రాజకీయ హక్కుగల పౌరుడుగా అభివృద్ధిగాంచజాలడు. అందు