Jump to content

పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/525

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బ్రిటీష్‌రాజ్యతంత్రము

35


ప్రభుత్వోద్యోగుల కర్మస్పర్శనములు, సరససల్లాపములు, మెప్పులు చూచి మురియుచున్నారో గాని మహాత్ముని ధర్మబోధలను కాంగ్రెసు నియమములను గూడ మరచి ప్రవర్తించుచున్నట్లు అనుమానము కలుగుచున్నది. తమ పరిపాలన చక్కగా జరుగుచున్నదో లేదో కనిపెట్టి చూచుటకును, ప్రజలకష్టసుఖము లరయుటకునుగదా, యీ మంత్రులు కార్యదర్శులు దేశములో పర్యటనముచేయుట ! ఇట్టితరి, యీ విందులలో, సన్మానములలో, ఊపిరితిరుగక యున్నందున, వీరు తమతో కష్టము లనుభవించిన కాంగ్రెసుసేవకులతోగాని జనసామాన్యముతోగాని దేశక్షేమ లాభములను గూర్చి మాటలాడుటకు గూడ వీలుకలుగుటలేదని వీ రేల గమనింపరు? మంత్రు లీ వ్యామోహమును వీడవలెను. ఈ విందులు గోవిందులు నిరాకరింపవలెను. ఈ వినతిపత్రములు తిరస్కరింపవలెను. తాముకలెక్టరుల యింటఅధికారులయింటబస చేయుట మానవలెను. ఉద్యోగులకు సందర్శనములిచ్చి బహిరంగముగా కరస్పర్శనము చేయుట మానవలెను. ప్రాతఖైదీలతోను, దీనజనులతోను, దరిద్రులతోను ఎక్కువగా కలిసిమెలసి వర్తింపవలెను. లేనిచో ప్రాతపరిపాలనా పద్ధతులును, నిరంకుశప్రభుత్వమును పోయి, ప్రజాపరిపాలన మేర్పడినదని జనసామాన్యము గ్రహింపనేరదు. ప్రాతమంత్రులకు క్రొత్త మంత్రులకు గల తారతమ్యము వెల్లడికానేరదు, ప్రజా ప్రభుత్వమనగా, ప్రజలందరికిని బాధ్యతగల ప్రభుత్వమనియు కేవలము ధనవంతులకే గాక, దరిద్రులకు, రైతులకు, కూలి