34
భారతదేశమున
గావలసిన సంస్కరణములనుగూర్చి మొఱబెట్టుకొనుచు వినతి పత్రములు సమర్పించు పద్ధతి మానవలెననియు, కాంగ్రెసు మంత్రులకు నిర్భయముగా తమ కష్టసుఖములను తెలుప వలసినదనియు, అవసరమని తోచినచో కావలసిన సంస్కరణములు సూచిఁచు నొక పజ్ఞాపనపత్రికను ఒసగవచ్చుననియు కాంగ్రెసులో బాధ్యత గలవారును, మహాత్ముడును, మన ప్రధానామాత్యుడును గూడ మొట్టమొదటనే చెప్పియున్నారు. కాని ప్రాత సంప్రదాయములో మునిగి తేలుచుండి ప్రాతపద్దతు లొక్కమారుగా మానలేని కొందరు ప్రజలు మన మంత్రులకు గూడ విందులు వినతిపత్రములు సమర్పించిరి. అంతట నీ వ్యామోహము వృద్ధియైనది. ఒకరినిచూచి ఒకరు ఇట్లుచేయుటయు వీనిని స్వీకరించుటయు జరుగుచున్నది. ఈ పదుగురుమంత్రులు పదిమంది కార్యదర్శులు వచ్చునప్పుడు పోవునప్పుడు గూడ ఏదో యొక సందర్భము కల్పింపబడుచు, విందులు, వినతిపత్రములు, పూలదండలు సమర్పింపబడుచున్నవి. పొగడ్తలు ఫోటోగ్రాఫులు వృద్ధియైనవి. స్వార్థపరులు ధనము విచ్చలవిడిగా ఖర్చుపెట్టి మంత్రులను కార్యదర్శులను ఏదోమిషపైన రప్పించి మెహర్బానీలు చేయుచున్నారు. త్యాగశీలురును స్వతంత్రయోధులునగు నీమంత్రులును కార్యదర్శులును తమ కాంగ్రెసు ధర్మములకు దీనివలన భంగము కలుగుచున్నదని కొంచమైన , ఆలోచించుటలేదు. ఈ అధికార వ్యామోహమున దిగ్ర్భమజెంది కర్తవ్యతా మూఢతచేత బాధ పడుచున్నారో లేక