బ్రిటీష్‌రాజ్యతంత్రము
33
ధనము విచ్చలవిడిగా వెదజల్లబడుచున్నది. క్రమశిక్షణము లేక, విధేయత లేక, పెద్దపిన్న తారతమ్యము లేక ఎవరికివారు నాయకులై కాంగ్రెసులో అపకీర్తికరములైన పనులు చేయుచుండుట చూచుచున్నాము. 'చోటా' కాంగ్రెసు నాయకులు బయలుదేరి కాంగ్రెసులో చీలికలు కలిగించుచున్నారు. సోషలిష్టులను వారు జవహర్‌లాలునెహ్రూ ప్రభృతుల పరిశుద్ద సామ్యవాద సిద్ధాంతములను శిరసావహింపక ఎవరికితోచిన సిద్ధాంతములను వారు వెదజల్లుచు శాంతిభద్రతలకు కూడ భంగము కలిగించి తమ కాంగ్రెసుసోదరులగు మంత్రులకు చాలకష్టములు తెచ్చిపెట్టు చున్నారు. ఇక మంత్రులలోకూడలోపములులేకపోలేదు. వీరిలో కొందరుకాంగ్రెస్ సాము గరడీలలో ఆరితేరివృద్దులైన మహా యోధులు, కొందరు నూనూగు మీసాలవారు, కొందరు తాత్కాలికముగా కాంగ్రెసు ప్రమాణములనుగైకొని వచ్చినవారు. ఇన్నిరకములవారిని కూడగట్టుకొని పరిపాలింపవలసివచ్చి శాసనసభలలోను ప్రభుత్వములోను మన ప్రధానమంత్రి కఠిన నియమములు కట్టుబాటులు చేసినాడు. ఇట్లు చేసియుండనిచో మనప్రభుత్వము కప్పలతక్కెడవలె యుండునేమో! రాష్ట్రీయ కాంగ్రెసుసభలలో మన కాంగ్రెసువారి వైఖరి చూచినచో కట్టుబాటులుండుట మంచిదే యైనదని స్థిరపడినది.
కాంగ్రెసే ప్రజలు, ప్రజలే కాంగ్రెసు, గనుకను కాంగ్రెసు మంత్రులు ప్రజాసేవకులే గనుకను పూర్వపు నిరంకుశ మంత్రులకు చేసినట్లు ప్రజలు కష్టపడి ఖర్చుపడి స్వాగతము లిచ్చి ఫోటోగ్రాపులు, దీసి విందులుచేసి తుదకు తమకు