బ్రిటీష్‌రాజ్యతంత్రము
31
ధరించుచు క్రిందివారిని ధరింపజేయుచునేయున్నారు. ప్రభుత్వోద్యోగులు ఖద్దరును స్వేచ్ఛగా ధరింపవచ్చునని మంత్రులవలన తాఖీదు సాదరుచేయబడినను అమలులో నదృశ్యమై యున్నది. జాతీయజెండా నెగురవేయుటకు ప్రజలు ఉత్సాహ పడుచుండగా, ప్రభుత్వ మామోదించుచుండగా, మంత్రులు దానిని శిరసావహించుచుండగా, కొందరు బ్రిటీషుప్రభు భక్తి పారాయణు లింకను 'యూనియ౯ జాక్'ను నెలకొల్పుచునె యున్నారు. బీహారుసెక్రటరీ యగు నొక ఐ. సి. ఎస్. ఉద్యోగి తన తాబేదారులకు జూరీచేసిన తాఖీదు కాంగ్రెసుమంత్రుల అధికారమునకు భంగము కలిగించుచున్నదని తరువాత రద్దుచేయబడినదిగాని అసలు సంగతితెలిసినది. జాతీయ భావములుగల భారతీయ ఐ. సి. ఎస్. ఉద్యోగియగు కామత్ గారిని ఆయనక్రింద నుండవలసిన తెల్లపోలీసు యుద్యోగిచేసిన అగౌరవమువలన ఆయన తనపదవికి రాజీనామానిచ్చుటలోనే ప్రభుత్వద్యోగములందు కూడ నేటికిని యెంతతారతమ్యమున్నదీ వెల్లడియగుచున్నది. భారతీయులను తెల్లవారింక ను అవమానించుచునేయున్నారు. ఈమధ్య మన విద్యార్థులు తెల్ల సోల్జరులవలన అవమానింపబడిరి. తెల్లసోల్జరులు చేయుచున్న అత్యాచారము లనేకములు బయల్పడినవి. మేజస్ట్రీటులు, పోలీసువారు ఇతర ప్రభుత్వ శాఖోద్యోగులు తమ ప్రాతపద్ధతులను ఇంకను మార్చుకొన లేదు. ఏ కొలదిమంది ఉద్యోగులో తప్ప చాలమంది ఇంకను ప్రజలను ఈగలు దోమలువలె చూచుచున్నారు. ప్రజలే