పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/516

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

26

భారతదేశమున


సంకల్పము గానిప్రభుత్వము మహాత్ముని కా యవకాశమును కలిగింపలేదు. ఈ దారుణవాదులుకూడా స్వతంత్రముకొరకే ప్రయత్నించు దేశభక్తులైనందున, దేశమునకు స్వపరిపాలన మొసగినచో వీరు తమ దారుణ వాదమును వదలి వేయుదురని మహాత్ముడు చెప్పినను ప్రభుత్వము నమ్మలేదు. రాష్ట్రీయ స్వపరిపాలనము వచ్చినచో వెంటనే వీరిని విడుదలచేయవలెనని రౌండు టేబిలు సభలోకూడా ఈయన చెప్పియున్నాడు. తుదకు మహాత్ముని జోస్యమే నిజమైనది.

ఈ దారుణవాదు లుంచబడిన సామాన్య జైళ్ళలోని పరిస్థితులును అండమాను దీవులలోని అనారోగ్యస్థితులును క్రూరపద్ధతులును భరింపలేక జైలుపద్దతులందు సంస్కరణములగోరుటకు ఈ దారుణవాదులు నిరశనవ్రతము చేయసాగిరి. ఇందుకొరకే జతిన్‌దాసు ప్రాయోపవేశము చేసియుండెను. దీనివలన సామాన్య రాజకీయఖైదీలకు కొంత సౌకర్యము కలిగింపబడెను గాని అండమానుదీవులవారి బాధ లట్లేయుండెను. ఇది భూతలస్వర్గమని ప్రభుత్వపక్ష పాతులనగా చూచివచ్చిన ప్రజాప్రతినిధు లిదిభూలోక నరకమనిరి. దీనినిగూర్చి శాసన సభలలో తీవ్రచర్చలు జరిగెను. గాని లాభము లేకపోయినది. ఇట్టిస్థితిలో నూతన రాజ్యాంగ సంస్కరణల చట్టము అమలులోనికి వచ్చినది. అండమాను ఖైదీలు 200 మంది తమ బాధలు భరించలేక ప్రాయోపవేశము చేయ నిశ్చయించిరి. అందువలన దేశములో గొప్ప సంచలనము కలిగినది. మహాత్ముడు తాను వారితరఫున పని