పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/515

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బ్రిటీష్‌రాజ్యతంత్రము

25


శాంతికి భంగముకలిగింపకుండ నుండవలసినదని కోరెను. ఆయన కోరికప్రకారముకొన్నా ళ్లూరకొనిరిగాని శాసనోల్లంఘనమును అణచుటకు ప్రభుత్వమువా రవలంబించిన క్రూరపద్ధతులు, లాటీచార్జీలు, కాల్పులు చూచినపిదప దారుణవాదులు చెలరేగి ప్రభుత్వముపై దిరుగబడిరి. భగవత్‌సింగు తన అసమ్మతి సూచించుటకు అసెంబ్లీసభలో బాంబుపడవేసెను. అంతటప్రభుత్వముగూడ తీవ్రమైన చర్యగైకొని కుట్రకేసులుపెట్టి చాలమందిని శిక్షించిరి. భగవత్‌సింగు నురిదీసిరి, విల్లింగ్డన్ ప్రభువు వచ్చినపిదప ఇంకను తీప్రపద్ధతి ప్రారంభించెను. ఈ దారుణవాదులను అణచుటకు రౌలటు శాసనముకన్న తీవ్రతరనిర్బంధములుగల ఆర్డినెన్సులజేసెను. ఎట్టి విచారణలేకనె వందలకొలది మందిని నిర్బంధింపసాగిరి. దేశములో పటాలములు నడుపబడుచుండెడివి. వారికి విద్యార్థులెల్లరు సలాములు చేయవలసియుండెను. దారుణవాదుల బంధువులు స్వేచ్చగా తిరుగుటకు వీలులేదు. అందరును అనుజ్ఞాపత్రములను పొందవలెను. పాఠశాలల పిల్లలుగూడ నిర్బంధించబడిరి. సర్ జా౯ ఆండర్సన్ వంగరాష్ట్రమునకు గవర్నరుగా నియమింప బడెను. ఐర్లాండులో సిన్ ఫిన్ విప్లవమున అనుభవముగలవాడై నందుననే నియమింపబడెనని ప్రతీతి. ఈసందర్భమున మూడువేలమంది యువకులు చెరలందుంచబడిరి. ఈ దారుణవాదుల దారుణకృత్యములకు ప్రభుత్వమువారి దారుణవిధానము తీసి కట్టుగా లేకుండెను. ఈ యువకులను సన్మార్గమునకు త్రిప్పవలెనని వీరి నహింసావాదులుగా చేయవలెనని మహాత్ముని