24
భారతదేశమున
ఇట్టి స్థితిలో మహాత్ముడు స్వరాజ్యము సంపాదించుటకు అహింసాపద్ధతులతో శాంతి సమరముచేసి సహాయ నిరాకరణ శాసనోల్లంఘనోద్యమములను ప్రారంభించెను. ఈ అహింసా మార్గముతో సాత్వికనిరోధముచేయుటలో తాము బాధపడుట తప్ప ప్రతిపక్షులను బాధపెట్టగూడదు. ఈ వింతపద్దతివలన దేశములోకలిగిన సంచలనమున కాశ్చర్యపడి నిజముగాదీని వలన కొంతలాభము కలుగునేమోయని తోచినదిగానిమహాత్ముని అహింసాపద్దతి శాంతి సమరము నణచుటకు ప్రభుత్వము ప్రయోగించిన హింసాపద్ధతులు, క్రూరశిక్షలు, లాఠీచార్జీలు, కాల్పులుచూచి ఈఅహింసాపద్ధతులతోడ సాత్వికనిరోధము చేయుటవలన లాభములేదని దారుణవాదులకెల్లరకు తోచినది. అంతట వారుచెల రేగి దారుణకృత్యములు చేయసాగిరి. 1924 లో రీడింగు ప్రభువుక్రిమినలు లా అమెండ్మెంటు సవరణ ఆర్డినెన్సు జారీచేసి తీవ్రనిర్బంధవిధానమును ప్రయోగించెను. 1924 అక్టోబరు, నవంబరులలో 63 మంది అరెస్టు చేయబడిరి. వీరిలో 18 మంది 1818 సం॥ రిగ్యులేషను క్రింద నిర్బంధింపబడి తరువాత ఆర్డినెన్సు క్రింద శిక్షింపబడిరి. కలకత్తా కార్పొరేషను ఎగ్జిక్యూటివ్ ఆఫీసరగు సుభాస్ చంద్రబోసును, ఇంకొకశాసన సభ్యుడునుకూడా అరెస్టుచేయబడిన వారిలోనుండిరి. ఈయువకులనెల్ల దేశములో వివిధజైళ్లలో పడవేసిరి.
1930 లో మహాత్ముడు సత్యాగ్రహము ప్రారంభించుటకు ముందు తన అహింసాపద్దతుల ప్రకారము శాంతిసమరము జరుపుకాలమున దారుణవాదులు దారుణకృత్యములుచేసి.