ఈ పుట ఆమోదించబడ్డది
బ్రిటీష్‌రాజ్యతంత్రము
17
గవర్నమెంటువారు 17 1/2 లక్షలరూపాయిలు క్రొత్త స్కీములకు శాంక్షనుచేసిరి. సాధారణపరిపాలన క్రింద 12 లక్షలరూపాయిల వ్యయము తగ్గింపదలచిరి.
జాతీయాభివృద్ధిని కలుగచేయు శాఖలకు గతసంవత్సరముకంటె ఈ సంవత్సరము 23 లక్షలు ఎక్కువఖర్చు పెట్టదలచిరి. ప్రజాక్షేమమును పెంపొందించు పనులకు 26 1/2 లక్షలు ఏర్పాటు చేయబడెను.
ఈ క్రింది విధముగా ధనవ్యయము తల పెట్టబడినది: –
గ్రామముల అభివృద్ధికి | రూ 10,00,000 | |
గ్రామములలో గ్రంథాలయములకు | 20,000 | |
పెద్దపట్టణములలో కలితిలేని పాలు సప్లయికి | 20,000 | |
కలితీలేని నేతిని తయారుచేసి అమ్ముటకు | 12,500 | |
పల్లెలలో నాణ్యమైన విత్తులుసప్లయి చేయుటకు | 3,00,000 | |
ఫెర్‌టిలైజర్లను సప్లయి చేయుటకు | 2,00,000 | |
పశుజాతిని అభివృద్ధి పరచుటకు | 37,500 | |
ఫలములను ఎక్కువగా నుత్పత్తి చేయుటకు | 2,000 | |
బంగాళాదుంపలను పరిశోధించుటకు | 5,000 | |
వ్యవసాయమునకు గొట్టపునూతులకు | 31,000 | |
ఖాదీపరిశోధన సల్పుటకు | 10,000 | |
చేనేత పరిశ్రమల అభివృద్ధికొరకు | 1,24,000 | |
లేబరు వెల్ ఫేరుపనికి (కార్మికక్షేమమునకు) | 10,000 | |
బెల్లమును తయారుచేయు విధముల అభివృద్ధికి | 38,000 |