పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/506

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

16

భారతదేశమున


టకు, రాజకీయఖైదీలను విడుదలచేయుటకు, మద్యపాన నిషేధమును చేయుటకు, గ్రామ పునరుద్ధరణము చేయుటకు, చేతి పరిశ్రమలను ఖద్దరును సంరక్షించి అభివృద్ధి చేయుటకు, వ్యవసాయదారుల ఋణభారమును తగ్గించుటకు, భూమిపన్ను తగ్గించుటకు భూస్వామ్య పద్దతులను ధర్మబద్ధములుగ జేయుటకు, కర్షక కార్మిక శ్రేయమును కలిగించుటకు వెంటనే ప్రారంభించిరి. కాంగ్రెసు ప్రభుత్వ వ్యయపద్ధతి ఎట్లున్నదో చూపుటకు సంయుక్తరాష్ట్రమునందు పండిత గోవిందవల్లభ పంతుగారు అధికారమునకు రాగానే శాసనసభలో ప్రవేశపెట్టిన వ్యయపట్టికను ఉదాహరణముగ గైకొనవచ్చును.

పూర్వము 1935-36 సం|| ఆదాయవ్యయ పట్టికలో 30 లక్షల రూపాయిలు, 1936-37 సం|| బడ్జెటులో 63 లక్షల రూపాయిలు, రాబడికిమించిన వ్యయము చూపించబడెను. ఈసంవత్సరము మొదట ప్రాతమంత్రులచే తయారుచేయబడిన బడ్జెటులో జమకంటెఖర్చు 41 లక్ష రూపాయిలు ఎక్కువఉన్నది. కాంగ్రెసువారు అధికారమునకు వచ్చుసరికి కొంతరాబడి అధికముకాగా ఆలోటు 30 లక్షలవరకు వచ్చినది. పరిపాలనా వ్యయము తగ్గింపబడెను. ముఖ్యముగా ప్రయాణపు అలవెన్సులు 6 లక్షలు తగ్గింపబడినది. ఇన్ని కారణములవలనలోటు లేకపోగా.. 4 1/2 లక్షలు నిలువ ఉండునట్లు ఆదాయవ్యయపట్టిక తయారు కాబడెను.