పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/505

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బ్రిటీష్‌రాజ్యతంత్రము

15

ఎన్నికలప్పుడు చేసిన వాగ్దానములను చెల్లించుట యనునది ప్రపంచములో నెక్కడను కని విని ఎరుగనిసంగతి. ఆపద మ్రొక్కులవలె అదను గడచినపిదప, ఎన్నుకొనబడిన ప్రజాప్రతినిధులు తమ వాగ్దానములు మరచి ప్రమత్తులై ప్రవర్తించుచుండుట జగద్విఖ్యాతము. కాని దేశసేవకు నడుముగట్టిన కాంగ్రెసు తన వాగ్దానములను మరువలేదు. ఎన్నికల ప్రణాళికలో చెప్పిన ప్రతిసంగతి “తూ చ" తప్పకుండా చెల్లించుటకు సమకట్టినది. బ్రిటీషు రాజ్యతంత్రమునందు పార్లిమెంటుమంత్రి గవర్నరు జనరలు, గవర్నరులను ఎట్లు నడిపించుచున్నారో కాంగ్రెసు రాజకీయములందు కాంగ్రెసు ప్రెసిడెంటు వర్కింగుకమిటీవారు కాంగ్రెసుమంత్రుల నట్లు నడుపసాగిరి. ఈ కాంగ్రెసు ప్రభుత్వము చేయుచున్న ఏడురాష్ట్రములును ఏకోన్ముఖమునకు తీసికొనిరాబడి కేవలము ప్రజల యొక్క క్షేమలాభములకొరకే పరిపాలన జరుపబడునట్లు విధింపబడినది. చేయునది కాంగ్రెసు ప్రభుత్వము; చేయించునది కాంగ్రెసే! ఇక చేయబడుపరిపాలనము ప్రజాపాలనమై ప్రజలచే, ప్రజలకొరకు నిర్వహింపబడుచుండుటలో నాశ్చర్యమేమి? ప్రభుత్వము వహించినవారు త్యాగశీలురు. అందువలన నీప్రభుత్వముయొక్క విధానమంతయుగూడ త్యాగధర్మములతో నిండిపోయినది. కాంగ్రెసుమంత్రులు ముందుగా తమ జీతములను పూర్వమంత్రుల జీతములలో 10 వ వంతుకు తగ్గించుకొనిరి. తరువాత కాంగ్రెసు ఉద్దేశ్యముల నొక్కటొక్కటిగా నమలులోపెట్టసాగిరి. నిర్బంధ శాసనములను రద్దుచేయు