Jump to content

పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/504

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

14

భారతదేశమున


II

అధికార స్వీకారము - నిర్వహణము.

పదునాల్గేడుల యరణ్యావాసము ఏబదేండ్ల స్వతంత్రపోరాటము జరిగినపిదప, స్వార్థపరుల రాజకీయపక్షములు, కీలుబొమ్మల ప్రభుత్వములు పోయి స్వతంత్రవీరుల కాంగ్రెసు ప్రభుత్వము రాగానే సేతుశీతాచలపర్యంతముగల భారత దేశము ఒక్కనిట్టూర్పు విడిచినది. సంపూర్ణ స్వాతంత్ర్యము లభింపకపోయినను, అధినివేశస్వరాజ్యము రాకపోయినను. నిజమైన రాష్ట్రీయ స్వపరిపాలనము లభింపకపోయినను బాధ్యతాయుత స్వపరిపాలనాపద్దతిలో సామాన్య విషయములందైన గవర్నరుల అడ్డంకిలేకుండా స్వదేశమంత్రుల ప్రభుత్వము జరుగునుగదాయనియు, తరతరములనుండి దారిద్ర్యదుఃఖము ననుభవించుచున్న భారతదేశ రైతుబిడ్డలు కూలివారునుగల పాటకజనము, కొంతవరకైన ప్రభుత్వసాహాయ్యము పొంది బ్రతుకు దెరువు కలిగి కాలక్షేపము చేయవచ్చుననియు, వారికిగల బాధలలో కొన్నిటినైన నీ ప్రజాప్రభుత్వము తీర్చగలదనియు, కాంగ్రెసు కరాచీలో చేసిన ప్రజల ప్రాతిపదిక హక్కులును ఈ ఏబదేండ్లలో చేసియున్న తీర్మానములలోను ఈఎన్నికలందు పాల్గొనినప్పుడు చేసిన సంస్కరణల ప్రణాళికలో చేసిన వాగ్దానములలోను కొన్ని పనులనైనను చేసి దీనజనులకు మేలు కలిగించగలదనియు ప్రజలెల్లరు చకోరపక్షులవలె వేచి యున్నారు.