Jump to content

పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/503

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బ్రిటీష్‌రాజ్యతంత్రము

13


ములు గల స్వాతంత్య్రయోధులను సత్యాగ్రహమహారధులను తయారు చేయగలిగినది. ఈమహా సైన్యములను నిర్మించుటలో యమనియమములవంటి ధర్మానుష్ఠాన పద్దతులు గల క్రమశిక్షణము గావించినది. అందువలననే బ్రిటీష్ రాజ్యతంత్రములకును ఆశలకును లోబడక కాంగ్రెసు సైనికులు పనిచేయ గలుగుచున్నారు. పురుషోత్తము డగు గాంధిమహాత్ముడు నాయకత్వము వహించినందుననే ఇట్టి పవిత్రమైన పరిస్థితి ఏర్పడినదని ప్రత్యర్థులు కూడ అంగీకరించియున్నారు. కాంగ్రెసు మహాతేజముతో శాంతిసమరమును జరిపి పరిశుద్ధమైన మనస్సుతో నేడు తన కార్యదీక్షను శాసన ధర్మబద్ధములైన మార్గముల ద్వారా సాధింపదలచినది. ఏప్రభుత్వము ప్రజల శాశ్వత దాస్యముకొరకు రాజ్యాంగ శృంఖలములను నిర్మించియున్నదో ఆప్రభుత్వముయొక్క సంస్థలందే ప్రవేశించి క్రమశిక్షణతో కట్టుబాటులతో పనిచేసి ఆ రాజ్యాంగ శృంఖలమును భగ్నముచేసి సంపూర్ణ స్వాతంత్ర్యమును స్థాపించుటకు ఈ సంస్థల నుపయోగించి కృతార్థత గాంచదలచినది. అందువల్లనే శాసనోల్లంఘన, సాత్వికనిరోధ, సహాయనిరాకరణ, సత్యాగ్రహ పద్ధతిని మార్చి రాజ్యాంగ ధర్మపద్ధతుల ద్వారా శాసనసభలందు ప్రవేశించి మంత్రిత్వాధికార స్వీకరణముజేసి నేడు రాష్ట్రీయ ప్రభుత్వములను నడుపుచున్న ది. ఇందుకొర కెన్నో కట్టుబాటులు చేసికొన్నది.