పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/497

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బ్రిటీష్‌రాజ్యతంత్రము

7


బడుటయు నొక ఆచారమైనది. ఇందుకు చందాలు వసూలు చేయబడుటయు బీద గుమాస్తాలు, గ్రామోద్యోగులు, బీదజనులు గూడ చందా లిచ్చుకొనవలసి వచ్చి బాధపడుచుండుటయు జరుగుచున్నది. ఇక మంత్రులుగాని పెద్ద యథికారులుగాని వచ్చునప్పుడు జరుగుఉత్సవములకు చేయబడు ఖర్చులకు ప్రజలు పడు బాధలకు మితిలేదు. అన్ని శాఖలలోను లంచగొండెతనము అధికమై ప్రజలు పీడింపబడుచున్నారనుటలో అతిశయోక్తి లేదు.

భారతదేశములోని పోలీసుశాఖ ఒక విచిత్రమైన సంస్థ. ఇతరదేశములందువలె వీరు ప్రజాసేవకులుగా నుండి పౌరులకు సహాయముచేయుట కేర్పడినవారుగారు. కేవలము బ్రిటీషుసామ్రాజ్యప్రభుత్వము వారి తాబేదారులై ప్రభుత్వముయొక్క పరువు ప్రతిష్టలను కాపాడుచు నిరంకుశ ప్రభుత్వము నమలు జరుపుట కేర్పడిన అధికారులై యున్నారు. సామాన్య వ్యవహారములందు గూడ వీరు చేయు జులుమునకు అత్యాచారములకు మితిలేదు. దేశప్రజలను వీరు మనుష్యులవలె చూడక పశువులవలె జూచుచుందురు. వీరికి నేరములను కనిపెట్టు శక్తితక్కువ. దౌర్జన్యముచేసి ఎవరినో యొకరిచేత ఒప్పించి కేసులు బనాయించుట మాత్రము తెలియును. ఈ పోలీసుశాఖలో లంచగొండితన మత్యధికముగా నున్నదనియు వీరనేక అన్యాయములను జేయుచున్నారనియు దీనిని వెంటనే సంస్కరింపవలసిన దనియు అనేక హైకోర్టు జడ్జీలు హెచ్చరించియున్నారు. ఇక రాజకీయములందు పోలీసువారుచేయు దారుణచర్యలమాట