Jump to content

పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/492

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

2

భారతదేశమున


ప్రవేశించి వానిని స్వాధీనము జేసికొని తానే ప్రభుత్వము వహించినది.

ఈ రాజకీయ పరివర్తనము చాల విచిత్రమైనది. ప్రభుత్వముతో ఎట్టి సంపర్కమును కలిగియుండుటకుగాని శాసనసభలందు ప్రవేశించుటకుగాని కాంగ్రెసు చాలకాలమువరకు ఇష్టపడలేదు. దీనికి కారణము ప్రభుత్వము తోడి సంబంధము విషతుల్యమనియు అందడుగిడినవారెల్లరు బ్రిటీష్ రాజ్యతంత్రమునందు చిక్కి. వారికి వశమై వ్యక్తిత్వమును గోల్పోయి వారి చెప్పుచేతలలో నేయుండి స్వదేశమునకు స్వధర్మమునకు ద్రోహ మొనరించుచుండుటయు, కొన్నాళ్లు దేశభక్తులని పేరుపొందిన మహానుభావులుకూడ ప్రభుత్వపువలలో చిక్కియుండుటయు కాంగ్రెసువారిలోగూడ కొందరు స్వార్ధపరులై ప్రభుత్వపక్షమున జేరుటయు కాంగ్రెసు కన్నులార గాంచియుండెను. కాంగ్రెసు నాయకుడుగానుండి సింహగర్జనలజేసిన సురేంద్రనాధ్ బెనర్టీ శాసనసభలలో ప్రవేశించి ప్రభుత్వమువారి వలలో జిక్కి వారి వ్యామోహమునబడి మితవాది యైపోవుటయు, కాంగ్రెస్ సభాధ్యక్షత వహించినవారిలో ననేకులను ప్రభుత్వము చేరదీసి బిరుదులిచ్చి అధికారములిచ్చి నోరుగట్టుచుండుటయు, కాంగ్రెసు వేదికపై కెక్కినవారిలో ప్రముఖులను గూడ అట్లే సత్కరించుచుండుటయు, అందువలన రెడ్డినాయుడు గారివంటి కుశాగ్రబుద్ధిగలవారు కూడ ఆవలలో చిక్కి గాంధీమహాత్ముని గోచీపాతరాయస్వరాజ్య మన సాహసించుటయు, ప్రభుత్వమును తీవ్రముగా విమర్శించియుండిన బయ్యా నరసిం