ఈ పుట ఆమోదించబడ్డది
భారతదేశమున
బ్రిటిష్ రాజ్యతంత్రము
1600 - 1937
ప్రథమభాగము : సింహావలోకనము.
మొదటి వరిచ్ఛేదము : కాంగ్రెసు ప్రభుత్వోదయము.
I
కాంగ్రెస్ రాజ్యనీతి సాధనవిధానములు.
1937 వ సంవత్సరము జూలై నెలలో కాంగ్రెసు (జాతీయమహాసభ) భారతదేశమునందు ఆరురాష్ట్రములలో మంత్రిత్వము స్వీకరించినది. తరువాత పశ్చిమోత్తర సరిహద్దు పరగణాలలో కూడా కాంగ్రెసు ప్రతినిధులే మంత్రులుకాగా నాటినుండి ఏడురాష్ట్రములందు ప్రభుత్వము చేయుచున్నది. ఈ మహాసంస్థ భారతదేశ దాస్యవిమోచనకొరకును దారిద్ర్యవిమోచన కొరకును సంపూర్ణ స్వాతంత్ర్యముతప్ప వేరు మార్గములేదని నిశ్చయించి అందుకొరకు ఏబ్రిటీషు సామ్రాజ్య ప్రభుత్వముతో తీవ్రముగా పోరాడుచు శాసనసభలను ఇతరప్రభుత్వ సంస్థలను బహిష్కరించి, సహాయ నిరాకరణమును జేసి, శాసనోల్లంఘనమును గావించి, అష్టకష్టములకోర్చి, అజ్ఞాతవాసమును గూడ జేసెనో ఆ ప్రభుత్వముయొక్క దుర్గములలోనే నేడు