Jump to content

పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/481

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

7

ముస్తాఫాలీఖాను నిశ్చయించుకొని 1932 జనవరి 18 వ తేదీన ఆశ్రమవాసులను లాటీచార్జిచేసి అరెస్టుచేసి ఆశ్రమమును వశము చేసికొని దానిధ్వజస్తంభమును ఇతర ఆస్తిని నాశనముజేసి అంతటితో కసితీరక ఆశ్రమవాసులకు 4, 5, సంవత్సరముల దీర్ఘశిక్షలు వేయించి ఆశ్రమమును పాడుపెట్టించెను.

ఆశ్రమవాసులపైన కేసువిచారణ జరుగుచుండగా జనవరి 26 తేది స్వాతంత్ర్య దినోత్సవమునాడు స్త్రీలు సత్యాగ్రహము చేసిరి. అంతట వీరినిబంపినది డాక్టరు సుబ్రహ్మణ్యముగారేయని ముస్తాఫాలీఖానునిశ్చయించి ఉగ్రుడై సుబ్రహ్మణ్యముగారు నాళము చినభీమరాజు గారింట నుండగా ముస్తఫాలీఖాను పోలీసు సిబ్బందితోవచ్చి ఆయనను భీమరాజుగారిని ఇంక నిరువురిని గలిపి అక్రమసమావేశమని ప్రకటించి పోలీసులను చెదరగొట్టుడని యాజ్ఞాపించెను. భీమరాజుగారును సుబ్రహ్మణ్యంగారును తొలగిపోమనియు తమ్ము అరెస్టుచేయుడనియు . నిశ్చలులై నిలిచిరి. అంతట నాపోలీసు అధికారి ఆగ్రహము పట్టలేక డాక్టరుగారిని చావమోదించెను. పది ఎముకలు విరుగగా ఆయన స్మృతిదప్పి పడిపోయిరి. మూడునెలలు మంచముపట్టిరి. అక్రమసభచేసిరని తన యధికారమును తిరస్కరించిరని ముస్తఫాలీ వీరిపైన నొక అబద్దపుకేసు బనాయించెను. ఈముస్తఫాలీఖాను తన తాబేదారులచేత నబద్దపుసాక్ష్య మిప్పించుటయేగాక