Jump to content

పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/480

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

6

మహాత్ముడు 1929 లో ఆంధ్రదేశ పర్యటనము సలిపినప్పు డీ యాశ్రమము నచ్చటి ప్రజాసేవయు జూచి సంతసించి తన యంగ్ ఇండియాపత్రికలో 16-5-29 తేదిన నిట్లు ప్రశంసించెను.

"నేనీవిశాలదేశమున గావించిన పర్యటనమునం దెచ్చటనుగూడ ఈ ఫిర్కాలో జూచినంత ఉత్సాహమును జీవకళను జూచియుండలేదు. ఆశ్రమవాసులు సామాన్యజీవయాత్రను గడపుచున్నను వారు గ్రామస్థులలో నైక్యమై వారిపై నఖండమైన పలుకుబడిని సంపాదించినారు. ఈ పేదగ్రామములో ఐదువేలరూపాయిలు వసూలయ్యెను. ఇంతపెద్ద మొత్తము మఱేఇతర స్థలమందును లభించియుండలేదు” గాంధిమహాత్ముని కత్యంత ప్రియతమమగు నిర్మాణ కార్యక్రమమునందును ముఖ్యముగా ఖద్ద రుద్యమమునందును రాజకియోద్యమమునందును ఎన్నికష్టములు వచ్చినను చలింపక స్థైర్యముతో పనిచేసిన వీరులలో ఆంధ్రదేశమునందు డాక్టరుగారికే అగ్రస్థానమియ్యవలెను.

డాక్టరుగారు 1930-1932 లో జరిగిన సత్యాగ్రహోద్యమములందు మఱల కారాగారమున బ్రవేశించినారు. గోదావరిజిల్లాలో కాంగ్రెసు ఉద్యమము విజృంభించుటకు మూలకారణముగానున్న ఈ డాక్టరుగారిని వీరియాశ్రమమును అణగ ద్రొక్కవలెనని రాజమహేంద్రవరడిప్యూటీ పోలీసు సూపరెంటెండెంటు