24
భారత దేశమున
నానాటికి హెచ్చసాగెను. రాజ్యతంత్రము ప్రయోగించి మొగలాయి చక్రవర్తిని లోబరచుకొనిరి. నవాబులను చేతిలో పెట్టుకొని కీలుబొమ్మలవలెనాడించుచుండిరి. పేరునకుఆచక్రవర్తి ఆనవాబులు దేశాధికారులుగాని నిజమైన అధికారులు కంపెనీ వారే. అయినను చాలారోజులవరకు దేశముయొక్క సామాన్య పరిపాలనగాని, శాంతిభద్రతలను గాపాడు పోలీసు అధికారము గాని, న్యాయవిచారణచేయు అధికారముగాని కంపెనీవారు వహించలేదు. అది తమచేతిలోని కీలు బొమ్మలకే వదలి కేవలము పన్నుల వసూలు అధికారముమాత్రమే తాము వహించిరి. నవాబులకు పరిపాలనకు సొమ్ము లేనందున వారది నిర్వహింపలేక పోవుచుండిరి. ఈ పద్ధతి చాలకాలము నడచిన పిదప దేశములో తాము నిలిపిన కీలు బొమ్మల నూడలాగి ప్రభుత్వాధికారములను కంపెనీవారే వహించిరి. కంపెనీ డైరెక్టరులు నియమించిన గవర్నరులే దేశపరిపాలకులైరి. ఈ పరిపాలనలో కూడా పాతపద్ధతులు మానలేదు. ఏదోమిష పైన యుద్ధముచేయుట ఆయుద్దవ్యయము తమ కీలుబొమ్మ నవాబులపైననో ప్రజలపైననో వేయుట, రాజ్యాక్రమణము చేయుట యీరాజ్యమునెల్ల తమ లాభముకొరకు పరిపాలించి లాభము నందుట కారంభించిరి. తమకు లోబడి కప్పములు గట్టిన నవాబులను రాజులుగా కొన్నాళ్లు ఏలనిచ్చుచుండిరి గాని వారివద్ద నుండి ధనములాగుకొని పీల్చి పిప్పి జేసి యేదోమిష పైన వారి రాజ్యము లాగికొనుచుండిరి. అనేక స్వదేశరాజులు భయపడి తామే లోబడి కప్పములు కట్టసాగిరి. మిత్రభేద