Jump to content

పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/479

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

5


డాక్టరు సుబ్రహ్మణ్యంగారు 1891 వ సంవత్సరము అక్టోబరు 12 వ తేదీన గుంటూరుజిల్లాలో కొండవీడులో జన్మించిరి. వీరితండ్రిగారు రామయ్యగారు; వీరాంధ్ర తెలగాణ్య బ్రాహ్మణులు. గౌతమసగోత్రులు, ఆపస్తంభ సూత్రులు. వీరు బెజవాడలో స్కూలుఫైనలు పరీక్షయందు త్తీర్ణులై కలకత్తాలో మల్లికుగారి నేషనల్ మెడికల్ కాలేజీలో ఎల్. సి .పి. యస్ . పరీక్షలో తేరి 1916 లో రాజమహేంద్రవరమున (ఆంగ్ల) వైద్యవృత్తిలో ప్రవేశించి అచిరకాలములోనే సుప్రసిద్ధులైరి. వీరికి బెజవాడ గ్రామకాపురస్తులు బ్రహ్మశ్రీ చెరుకుపల్లి బుచ్చిరామయ్యగారి కొమార్తెయగు కామేశ్వరమ్మగారినిచ్చి 1912 వ సంవత్సరములో వివాహముజేసిరి. ఈ దంపతులకు ఇద్దరు కొమారులును ఇద్దరు కొమార్తెలును గలిగిరి.

డాక్టరుగారు గాంధిమహాత్ముని యాదేశానుసారముగ దేశసేవానిరతులై 1920 లో వైద్యవృత్తివదలి కాంగ్రెసు ఉద్యమమున బ్రవేశించి 1921 లో రాష్ట్రీయ కాంగ్రెసుకమిటీకి కార్యదర్శియై ఒక సంవత్సరము కారాగారవాసశిక్షను పొందిరి. 1924 లో నీయన సీతానగర సత్యాగ్రహాశ్రమమును స్థాపించి, ప్రజాసేవచేయసాగిరి. ఈ యాశ్రమమునజేరిన యువకు లీ మహనీయుని నాయకత్వమున దేశమున కఖండ సేవజేసి ప్రఖ్యాతిగాంచి ప్రజానాయకులైనారు. గాంధి,