పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/478

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

4


మిత్రస్మృతి

“అకుంఠితకార్యదీక్షాపరుడై పదునా రేండ్లు అవిచ్చిన్నముగ సర్వాంగశోభితమగు శ్రీగౌతమీ సత్యాగ్రహాశ్రమమును నడుపుచు, ప్రాణికోటుల బాధానివృత్తి కంటె పరమపురుషార్థ మింకొకటిలేదను నుత్తమాదర్శా కృష్ణుడై సీతానగర ప్రాంతీయులకేగాక నానాదూర గ్రామాదులనుండియు నేతెంచు వివిధరోగపీడితులగు నార్తులకు ననేకవిధములగు చికిత్సలనొనరించి నీరోగుల గావింపుచు, స్వరాజ్యసంపాదనాసక్త చిత్తులగు యువకుల కుత్సాహజనకుడయి దేశనాయకులచే నియుక్తములగు మార్గములలో ననుచరులను నడుపుచు, దేశ దారిద్ర్యనిర్మూలనోపాయముగ గన్పెట్టబడిన ఖద్దరును విరివిగబుట్టించి, సంగ్రహించి, ప్రపంచించి, దీనులకు సాయపడుచు, మహాత్మాగాంధిగారి యాదేశములనే తన జీవితసూత్రములనుగ జేసికొని, పత్నీ పుత్రభ్రాతృ బంధుమిత్రాదులయందు సంగమువీడి, నిష్కపట చిత్తవృత్తితో, నిరాడంబరజీవనుడై, తానుచేసిన దేశసేవకు నెట్టిఫలముల నాశింపక, కేవల కర్మయోగియై, దేశసేవయే శ్రీహరిసేవయని నిశ్చితుడయి, నిరుడీనాడు ' (మార్గశిర శుద్ధ ఏకాదశి) రాత్రిపండ్రెండు గంటలవేళ ప్రశాంతంబుగ ప్రాణములవిడచి, మనమిత్రుడు శ్రీయుత బ్రహ్మాజోశ్యుల సుబ్రహ్మణ్యము దివికేగెగాదె? ఆతని నే డొకపరి స్మరింతము" - (13-12-37 ఆంధ్రపతిక)