438
బ్రిటిష్ రాజ్యతంత్రయుగము
1901 హబిబుల్లా ఆఫ్‌గ౯ ఆమీరగుట. విక్టోరియారాణి మరణము
1902 వివేకానందస్వామి నిర్యాణము (జూలై 4), మార్కోనీ తీగలేనితంతి.
1903 కర్జను దర్బారు. (ఎడ్వర్డు పట్టాభిషేకము)
1904 టిబెట్టు దేశమునకు దండయాత్ర. సహకార సంఘముల చట్టము. రష్యా జపాను యుద్ధ ప్రారంభము.
1905 ఆమీరుతో సంధి. వంగరాష్ట్రవిభజనము. 'వందేమాతరం' ఉద్యమము. మింటో ప్రభువు వైస్రాయియగుట, లిబరల్‌పార్టీ ఇంగ్లాండులో ప్రభుత్వమువహించుట. మార్లే ఇండియారాజ్యాంగ కార్యదర్శియగుట.
1907 ఆంగ్ల రష్యను కమీషను. రాజుద్రోహ మీటింగుల చట్టము. దక్షిణాఫ్రికాలో భారతీయులను ట్రాన్సువాలుకు రాకుండ నిషేధించుట.
1908 మణిక్తలా కేసు విచారణ. లోకమాన్య తిలకు రాజద్రోహమునకు శిక్షింపబడుట (6 సంవత్సరములు). న్యూస్ పేపర్ల చట్టము. ప్రేలుడు పదార్ధముల చట్టము. క్రిమినలు లా సవరణచట్టము.
1909 మింటో మార్లే రాజ్యాంగ సంస్కరణములు.
1910 హార్డింజి ప్రభువు వైస్రాయియగుట. ఇండియ౯ ప్రెస్సు ఆక్టు.
1911 ఢిల్లీదర్బారు. భారతదేశమునకు ఢిల్లీ ప్రభుత్వ రాజధానిగా చేయబడుట, వంగరాష్ట్ర విభజనము మార్పబడుట. చైనాలో విప్లవము.
1912 బాల్కన్‌యుద్ధము. చైనా ప్రజాస్వామికమగుట. హ్యూము దొర నిర్యాణము.
1913 దక్షిణాఫ్రికా భారతీయులనుగూర్చి హార్డింజి ప్రభువు సానుభూతి.
1914 ఐరోపా మహాసంగ్రామము, (ఆరంభము ఆగష్టు 4)
1915 ఇండియా డిఫెన్సుచట్టము.
1916 షెమ్సు ఫోర్టు ప్రభువు వైస్రాయియగుట. అనీబిసెంట్ గారు హోంరూలులీగు స్థాపించుట. లక్నో ఒడంబడిక (హిందూముసల్నానుల రాజీ ప్రణాళిక). కాశీ హిందూవిశ్వవిద్యాలయ స్థాపన.
1917 మెసపొటేమియా కమిషను రిపోర్టు. మాంటేగూ ఇండియారాజ్యాంగ కార్యదర్శియగుట. రాజ్యాంగ సంస్కరణముల వాగ్దాన ప్రకటన. భారతదేశమునకు మాంటేగూ వచ్చుట. అనీబిసెంటు ఇంటరన్ మెంటు. దాదాభాయి నౌరోజీ నిర్యాణము (జూను 30). రష్యా విప్లవము.