సంవత్సరములవారీ చరిత్ర
437
1881 ఫ్యాక్టరీల చట్టము. మైసూరును మఱల ప్రాతరాజున కిచ్చుట. ఈజిప్టులో అరబీబే పితూరీ.
1882 వివేకానందస్వామి శ్రీరామకృష్ణపరమహంసకు శిష్యులగుట, దివ్యజ్ఞానసమాజ కార్యాలయము అడయారులో స్థాపింపబడుట.
1883 ఇల్ బర్టు బిల్లు. శ్రీ దయానంద సరస్వతి నిర్యాణము.
1884 రష్యావారు మెర్ వ్ (Merv) ఆక్రమించుట రష్యా ఆఫ్‌గ౯ కమీషను. రిప్ప౯ప్రభువు పనిమానుకొనుట. డఫ్రి౯ వైస్రాయియగుట, బ్రహ్మసమాజ ప్రధానాచార్యుడగు కేశవచంద్రసేను నిర్యాణము,
1885 మూడవ బర్మాయుద్ధము. అఖిలభారత కాంగ్రెస్ మహాసభ ప్రధమసమావేశము, శాలిస్ బరీ ఆంగ్ల ప్రధానామాత్యుడగుట.
1886 అప్పర్ బర్మాను కలుపుకొనుట, ఢిల్లీలో హిందూమహమ్మదీయ కలహము. శ్రీ రామకృష్ణ పరమహంస నిర్యాణము. (ఆగష్టు 16)
1888 హజారా దండయాత్ర. లాన్సుడౌను ప్రభువు వైస్రాయియగుట.
1889 కాశ్మీరమహారాజు రాజ్యత్యాగముజేయుట. పండిత జవహర్లాల్ సెహ్రూగారి జననము. (నవంబరు 14)
1891 ఫ్యాక్టరీలచట్టము; యుక్తవయస్సుచట్టము. (Age of Consent Bill) మణిపుర పితూరీ.
1892 ఇండియ౯ (శాసన సభల) కౌన్సిళ్ళ చట్టము. గ్లాడ్ స్ట౯ నాలుగవమారు ఇంగ్లాండు ప్రధానామాత్యుడగుట.
1893 డ్యురాండు కాబూలుకు రాయబారిగ పోవుట.
1894 ఎల్జి౯ ప్రభువు వైస్రాయి యగుట. నల్లమందు విచారణసంఘము, (కమిషను). బంకించంద్రచటర్జి నిర్యాణము (ఏప్రిలు 8)
1895 శాలిస్ బరీ ఇంగ్లాండు ప్రధానామాత్యుడగుట చిత్రాలు దండయాత్ర.
1896 భారతదేశమున కఱవు. 'ఎక్సు రే' కని పెట్టబడుట.
1897 బొంబాయిలో ప్లేగు (మహామారి). ర్యాండు, ఆయిర్ స్టులు పూనాలో హత్యచేయబడుట. హిందూదేశ సరిహద్దులో తిరుగుబాటులు.
1898 లోకమాన్య తిలకుకు రాజద్రోహనేరమునకు 1 1/2 సo|| శిక్షవేయుట.
1899 కర్జను ప్రభువు వైస్రాయియగుట. దేశమున కఱవు.
1900 పశ్చిమోత్తర సరిహద్దుపరగణా నిర్మాణము,