436
బ్రిటిష్ రాజ్యతంత్రయుగము
1868 పంజాబు భూస్వామ్య (టెనెన్సీ) చట్టము. శ్రీ గాజుల లక్ష్మీనర్సుసెట్టిగారి నిర్యాణము. ఆంబాలనుండి ఢిల్లీ వరకు రైలుదారి తెరువబడుట. షెర్ ఆలీ ఆప్ఘనిస్తాన అమీరగుట.
1869 మేయోప్రభువు వైస్రాయియగుట. షెర్ ఆలీతో అంబాలా కాన్ఫరెన్సు. మహాత్మాగాంధి జననము (అక్టోబరు 2). సూయజు కాలువ తెరువబడుట. హరిశ్చంద్రముఖర్జీ నిర్యాణము.
1870 ఫార్ స్టర్ దొర విద్యాచట్టము, ఫ్రెంచి ప్రజాస్వామిక ప్రకటన.
1872 ఆండమానులలో మెయో హత్యచేయబడుట. నార్తుబ్రూకు ప్రభువు వైస్రాయియగుట. సీయిస్థా౯ సరిహద్దు తగాదా. శ్రీ అరవిందఘోషు జననము (ఆగష్టు 15)
1873 రష్యావారు ఖైవు (Khive) ను పట్టుకొనుట.
1874 బీహారులో కఱవు. ఇంగ్లాండులో డిస్రేలీ ప్రధానామాత్యుడగుట.
1875 బరోడా గెయిక్వారు కేసు. ఏడవ ఎడ్వర్టు ప్రిన్సు ఆఫ్ వేల్సు గా ఇండియాకువచ్చుట. అమెరికాలో దివ్యజ్ఞానసమాజ స్థాపన, దయానందసరస్వతిగారి ఆర్యసమాజము బొంబాయిలో స్థాపింపబడుట.
1876 ఇంగ్లాండురాజులకు ఇండియాచక్రవర్తి బిరుదమిచ్చు పార్లమెంటు చట్టము, లిట్ట౯ ప్రభువు వైస్రాయియగుట. ఖెలట్ సంధి; కఱవు.
1877 ఢిల్లీదర్బారు. ఇంగ్లాండురాణీ విక్టోరియా భారతదేశ మహారాజ్ఞిగా ప్రకటింపబడుట. భారతదేశమున కఱవు వ్యాపించుట.
1878 దేశభాషల వార్తాపత్రికల చట్టము. (Vernacular Press Act) భారతీయ పటాలములు మాల్టా కంపబడుట బెర్లి౯ సంధి - రెండవ ఆఫ్‌గను యుద్ధము, బర్మా రాజగు మిండ౯మి౯ మరణము, ఆయుధముల చట్టము. (ఆరమ్సు ఆక్టు). హిందూపత్రిక మద్రాసులో వారపత్రికగ స్థాపింపబడుట.
1879 గండమాక్ సంధి. బర్మా రాజకుమారి హత్య. కాబూలులో కావగ్నరీ హత్యచేయబడుట. కాబూలును మఱల నాక్రమిందుట.
1880 రిప్ప౯ ప్రభువు వైస్రాయియగుట. మెయివాండ్ యుద్ధము, దక్షిణాఫ్రికాలో బోయరు యుద్ధము ప్రారంభమగుట, కాందహారునకు దండయాత్ర అబ్దుల్ రహమానును అమీరుగా అంగీకరించుట, గ్లాడ్ స్ట౯ మఱల ఇంగ్లాండు ప్రధానామాత్యుడగుట.