పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/459

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సంవత్సరములవారీ చరిత్ర

435

1855 సంతాలుల తిరుగుబాటు. మద్రాసు టార్చర్ (హింసల) కమిషను.

1856 అయోధ్యను కలుపుకొనుట.

1856 క్యానింగు ప్రభువు గవర్నరుజనరలగుట. పెర్షియాతో యుద్ధము. శ్రీ లోకమాన్యతిలకు జననము (జూలై 23) .

1857 ఆఫ్‌గనిస్థాన అమీరుతో సంధి. మీరతు పట్టణమున సిపాయి విప్లవము ప్రారంభమగుట (మే నెల). ఢిల్లీమరల పట్టుబడుట (సెప్టెంబరు). హ్యావలక్ లక్నో చేరుట (సెప్టెంబరు). సర్ సి. కాంబెల్ లక్నోను రక్షించుట (నవంబరు). స్టేట్ అఫెన్సెస్ ఆక్టు. కలకత్తా బొంబాయి మద్రాసు విశ్వవిద్యాలయములు స్థాపింపబడుట.

1858 ఝాన్సీ ముట్టడీ (మార్చి) అయోధ్యను జయించుట. శాంతి ప్రకటన (జూలై). ఇండియా గవర్నమెంటు ఇంగ్లీషు రాజ్యమకుటమున జేర్పబడుట. విక్టోరియారాజ్ఞి ప్రకటన (నవంబరు 1.)

1859 క్యానింగు వైస్రాయిగ నియమింపబడుట. జేమ్సువిల్సను ద్రవ్య మంత్రిగ నియమింపబడుట. మద్రాసు ప్రవాసముల II వ రెగ్యులేషను జిల్లా (ప్యూనిటివు) పోలీసు చట్టము

1860 పశ్చిమోత్తర పరగణాలలో కఱవు. ఇండియా శాసవసభల నిర్మాణచట్టము. పీనలుకోడ్డు శాసనమగుట.

1861 అమెరికాలో సివిలుయుద్ధము. రవింధ్రనాధఠాకూరు జననము (మే). రష్యారైతుల దాస్యవిమోచనము. శ్రీ మదన్‌మోహన మాళవియ జననము.

1862 ఎల్జి౯ప్రభువు వైస్రాయియగుట, హైకోర్టులు స్థాపింపబడుట. శ్రీ వివేకానందస్వామి జననము (జనవరి 9). అమెరికాలో బానిసత్వమును మాన్పుట.

1863 దోస్తుమహమ్మదు మరణము.

1864 లారెన్సు వైస్రాయియగుట. భూటానుతో యుద్ధము. బందరు ఉప్పెన.

1865 అమెరికా సివిలుయుద్ద మంతమగుట. శ్రీ లాలా లజపతిరాయి జననము.

1866 ఒరిస్సా రాష్ట్రమున కఱవు. శ్రీ గోపాలకృష్ణ గోఖలే జననము.

1867 ఇంగ్లాండులో ఎన్నికల సంస్కరణము. (రిఫారంఆక్టు). భారతదేశమున ప్రెస్ అండ్ బుక్సు రిజిస్ట్రేషను చట్టము.