434
బ్రిటిష్ రాజ్యతంత్రయుగము
1837 విక్టోరియా ఇంగ్లాండు రాణియగుట. అయోధ్యలో విప్లవమురాకుండ కర్నల్ 'లోవ్' కాపాడుట. హిందూస్థానమున కఱవు.
1838 ఆఫ్‌గనురాజ్యము నాశించిన షా షుజాకును, రంజితసింగుకును తూర్పుఇండియా కంపెనీకిని ఒడంబడిక . కేశవచంద్రసేను, క్రిస్టోదాస్‌పాల్, బంకించంద్ర చటర్జీల జననము.
1839 సింధు అమీరులపైన నొక క్రొత్తసంధి బలవంతముగా విధించుట. రంజిత్ సింగు మరణము. ఆఫ్‌గనిస్థానములోనికి దండయాత్ర. ఘజినీని కాబూలును పట్టుకొనుట. సతారారాజును పదచ్యుతునిజేయుట.
1840 దోస్తుమహమ్మదు లోబడుట. ఇంగ్లాండులో 'పెన్నీ' తపాల ఆరంభము.
1841 బరన్సు, మెక్నాట౯లు హత్యచేయబడుట.
1842 ఎలె౯బరో గవర్నరుజనరలగుట. ఆఫ్‌గన్ యుద్ధము - సంధి.
1843 సింధుదేశ ఆక్రమణము. మహారాజపురము పన్నియారుల దగ్గర గ్వాలియరు సేనల నోడించుట-బానిసత్వము నిషేధింపబడుట.
1844 సర్ హెన్రీ హార్డింజి గవర్నరుజనరలగుట.
1845 సిక్కుల సైన్యము సట్లేజినదిని దాటుట. మొదటి సిక్కు యుద్ధము.
18444 గాజుల లక్ష్మీనర్సుసెట్టిగారు, చెన్నపట్టణ స్వదేశసంఘమును - క్రెసెంట్ పత్రికను స్థాపించుట.
1847 శ్రీ అనీబిసెంటు జననము (1వ అక్టోబరు.)
1848 డాల్‌హౌసీ గవర్నరుజనరలగుట. రెండవ సిక్కు యుద్దము.
1848 వీరేశలింగంగారి జననము. (ఏప్రిలు 16). సురేంద్రనాధ బెనర్జీ జననం.
1849 పంజాబును ఇంగ్లీషురాజ్యమున కలుపుకొనుట, మాప్లాల పితూరీ. సతారారాజ్యమును డల్‌హౌసీ కలుపుకొనుట.
1850 స్టేట్ ప్రిజనర్సు ఆక్టు.
1851 కలకత్తా బ్రిటిష్‌ఇండియన్ సంఘము స్థాపింపబడుట.
1852 రెండవ బర్మాయుద్ధము. గోదావరి అనకట్ట పూర్తియగుట.
1853 సర్ జా౯ లారెన్సు పంజాబు చీఫ్ కమిషనరగుట. బొంబాయి తాణా రైల్వే తెరువబడుట. నాగపురమును కలుపుకొనుట. కంపెనీకి రాజ్యాధికారపట్టా మరల నివ్వబడుట.
1854 భారతదేశమున తంతివార్త ప్రారంభము, క్రిమియన్ యుద్ధము