428
బ్రిటిష్ రాజ్యతంత్రయుగము
1620 ఇంగ్లీషు తూర్పుఇండియా కంపెనీవారు పోర్చుగీసువారి నోడించుట.
1628 షాజహాను భారతదేశ చక్రవర్తియగుట.
1630 ఇండియాలో పెద్ద కఱవు స్వాలీదగ్గర పోర్చుగీసువారు ఓడుట.
1832 గోల్కొండనవాబు ఇంగ్లీషు వర్తక కంపెనీకి బందరులో సువర్ణ ఫర్మానా అనబడు వ్యాపారపట్టా నిచ్చుట.
1635 ఇంగీషుకంపెనీకి పోర్చుగీసువారికి యుద్ధవిరామ సంధి జరుగుట.
1639 చంద్రగిరిరాజు ఇంగ్లీషుకంపెనీకి చెన్నపురిలో స్థలమిచ్చుట.
1641 మద్రాసులో ఫోర్టుసెంట్ జార్జికోట స్టాపింపబడుట,
1642 ఇంగ్లీషు తూర్పు ఇండియాకంసెనీవారికిని పోర్చుగీసువారికిని స్థిరమైన సంధి; ఇంగ్లాండులో అంతఃకలహములు, సివిలు యుద్దము.
1649 ఇంగ్లాండు రాజగు మొదటి చార్లెసు వధింపబడుట.
1652–54 మొదటి డచ్చియుద్ధము.
1652-58 మద్రాసు ఒక రాజధానిగా చేయబడుట.
1657 ఇంగ్లీషు ప్రభుత్వ సర్వాధికారియగు క్రాంబెల్ తూర్పుఇండియా కంపెనీకి వ్యాపారపట్టా నొసగుట.
1658 ఔరంగజేబు భారతదేశ చక్రవర్తియగుట.
1662 బొంబాయిని పోర్చుగీసువారు ఇంగ్లీషురాజగు రెండవఛార్లెసుకిచ్చుట.
1668 బొంబాయిని చార్లెసురాజు ఇంగ్లీషుతూర్పుఇండియా కంపెనీ కిచ్చుట. ఫ్రెంచి తూర్పుఇండియా వర్తక కంపెనీ స్థాపింపబడుట.
1674 శ్రీ ఛత్రపతి శివాజీ స్వతంత్ర రాజుగా పట్టాభిషిక్తుడగుట.
1680 శ్రీ ఛత్రపతిశివాజీ నిర్యాణము.
1686 ఇంగ్లీషు తూర్పు ఇండియాకంపెనీ మొగలు సామ్రాజ్యముతో పోరుట. వంగరాష్ట్రమున కంపెనీ వర్తక స్థానములు నాశనమగుట,
1687 మద్రాసు ఒక 'మేయరు' క్రింద " మునిసిపాలిటీగా స్థాపింపబడుట. ఇంగ్లీషు వర్తకకంపెనీవారు తమ ముఖ్యస్థానమును సూరతునుండి బొంబాయికి మార్చుట.
1690 కలకత్తా స్థాపింపబడుట.
1698 తూర్పుఇండియా కంపెనీకి పోటీ కంపెనీ స్థాపింపబడుట.