Jump to content

పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/451

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సంవత్సరములవారీ చరిత్ర

427


సంవత్సరములవారీ చరిత్ర

556 భారతదేశమున అక్బరు మొగలుసామ్రాజ్య చక్రవర్తియగుట.

1571 లెపాంటో యుద్ధమున స్పెయినురాజ్యము తురుష్క నౌకాదళము నోడింపగా ఐరోపావర్తకులకు తురుష్కులవలని బాధలుపోయి తూర్పుదేశములతో వ్యాపారాభివృద్ధికి మార్గము లేర్పడుట.

1579 ఆంగ్లనావికుడగు సర్ ఫ్రాన్సిస్ డ్రేక్ ప్రపంచముచుట్టు సముద్రయానము జేసిరాగా సముద్ర మార్గముల వ్యాపారము విజృంబించుట. ఇంగ్లాండులో తురుష్క వర్తకకంపెనీ స్థాపింపబడుట.

1580 సముద్రములం దంతవరకు బలవంతమైయుండిన పోర్చుగల్లు రాజ్యము స్పెయిను రాజ్యమునకు లోబడి బలహీనమగుట.

1583 ఇంగ్లీషు తురుష్క వర్తకకంపెనీవారు హిందూదేశముతో వర్తకము జేయుటకు 'టైగర్' అను ఓడను పంపుట.

1588 శ్పానిష్ ఆర్మడా వినాశనము. సముద్రమార్గములను చేజిక్కించుకొన్న స్పెయినురాజ్య నౌకాదళములను ఇంగ్లాండు విచ్చిన్నముచేయుట,

1599 తూర్పుఇండియా వర్తక కంపెనీ ఇంగ్లాండులో స్థాపింపబడుట.

1600 ఇంగ్లీషురాణియగు ఎలిజబెత్తు, తూర్పు ఇండియాకంపెనీవారికి భారతదేశమున వర్తకము చేసికొనుటకు పట్టా నొసగుట.

1603 ఇంగ్లాండు రాణియగు ఎలిజబెత్తు మరణము.

1605 అక్బరు చక్రవ ర్తి నిర్యాణము- జహాంగీరు భారతదేశ చక్రవర్తియగుట.

1612 తూర్పుఇండియా కంపెనీ వాటాదారుల సంఘముగా చేయబడుట. ఇంగ్లీషు కెప్టెన్ బెస్టు, స్వాలీదగ్గరను ఇండియా పశ్చిమతీరమునను పోర్చుగీసువారిని ఓడించుట. సూరతులో నింగ్లీషు వర్తకస్థానము (ఫ్యాక్టరీ) స్థాపింపబడుట.

1615 సర్‌తామస్‌రో ఇంగ్లాండురాజ్య రాయబారిగా మొగలు చక్రవర్తి దర్బారుకు వచ్చుట. (1615 మొదలు 1618 వరకు నితడు మొగలు దర్బారులో రాయబారిగ నుండెను.)