Jump to content

పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/449

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కాంగ్రెస్ ప్రభుత్వోదయము

425


ముగా నీ ఎన్నిక దేశ స్వాతంత్ర్యపక్షమునకును బ్రిటిషుసామ్రాజ్య పక్షమునకును జరిగిన రాజకీయ సమరమని చెప్పవచ్చును. అందువలననే కాంగ్రెసుకు వ్యతిరేకముగా బ్రిటిషుసామ్రాజ్య ప్రభుత్వము వారును, వారి నాశ్రయించుకొని యున్న పైన చెప్పబడిన వివిధవర్గములవారును కలిసి, ఏకమై అతి తీవ్రముగా పనిచేయసాగిరి. దేశములో గొప్ప సంచలనము కలిగెను. 3 1/2 కోట్ల నియోజకులకు ఎన్నికహక్కు కలుగుట యొక్కటే ఈ క్రొత్తరాజ్యాంగమునందలి మంచి లక్షణము. ఈ ఎన్నికహక్కులను ప్రజలెట్లు వినియోగింతురో తెలిసికొనవలసి యుండెను.

1937 ఫిబ్రవరిలో ఎన్నికలు జరిగెను. దేశములోని అధికారబలము, ధనబలము, పశుబలము, కలిసిన సామ్రాజ్య తత్వమునకు అపుడు గొప్పపరాజయము కలిగెను. పదునొకండు రాష్ట్రములలో ఏడు రాష్ట్రములందు కాంగ్రెసు అధిక సంఖ్యాకులగు సభ్యులను శాసనసభల కంపకలిగెను. విజయము గాంచిన కాంగ్రెసు-అభ్యర్థులకు వారి ప్రత్యర్థులకన్న వేలకు వేలు హెచ్చువోట్లు వచ్చెను.

IV

ఇటులు శాసనసభలు కాంగ్రెసుకు వశమాయెను. అపుడు 'మంత్రిత్వము స్వీకరింపవచ్చునా స్వీకరింపరాదా?' అని కాంగ్రెసువారికి ఆలోచన కలిగెను. ఏలనగా రాజ్యాంగ చట్టమువలన గవర్నరుజనరలుకును గవర్నరులకును నిరంకుశములైన విశేషాధికారములు కలవు. వారు వాని నుపయోగించి