424
బ్రిటిష్ రాజ్యతంత్రయుగము
శాసనసభలను వశము చేసికొని రాజ్యాంగధర్మపద్ధతుల ప్రకారము పోరాడుచు పూర్ణ స్వరాజ్యస్థాపనకొరకును, స్వాతంత్ర్య సమరమునందు ప్రజాశక్తికి హెచ్చు బలము కలిగించుటకును, ఆయధికార బలము నుపయోగించుటకును నిశ్చయించెను. ఆ ప్రకారము శాసనసభలందు ప్రవేశించి తాను చేయదలచిన కార్యములనుగూర్చి ఒక ఎన్నికల ప్రచారప్రణాళికను తయారుచేసెను. ప్రజా స్వాతంత్ర్య నిరోధక శాసనములను రద్దుచేయుట, రాజకీయ నిర్బంధితులను విడుదలచేయుట, ప్రజాస్వాతంత్ర్యములు, (సివిల్ లిబర్టీస్ ) కరాచీ కాంగ్రెసు తీర్మానించిన ప్రాతి పదిక - హక్కులు స్థాపించుట; ఆర్థికదుస్థితిని మాన్పి దేశ దారిద్ర్యమునుబాపుట; భూస్వామిత్య పద్దతులు శిస్తులవిధానములు సంస్కరించుట ఋణభారమును తగ్గించుట, కార్మికులకు కర్షకులకు జీవనాధారములు కలిగించుట, వారికి క్షేమము కలుగు సదుపాయములు చేయుట; మద్యపాన నిషేధముచేయుట; హరిజనోద్దరణమునకు తోడ్పడుట; ఖద్దరుకు గ్రామకుటీర పరిశ్రమలకు సహాయముచేయుట; కులములవారీగా నియోజనపద్ధతి (కమ్యూనల్ అవార్డు) రద్దు వరిపించుట, మొదలగు దేశక్షేమకరములగు సత్కార్యములు ఈ ప్రణాళికలో గలవు. ప్రజలు కాంగ్రెసుకు వోటునిచ్చినచో ఈ కార్యక్రమమునకు వోటునిచ్చినట్లే. అనగా బ్రిటిషుసామ్రాజ్య తత్త్వము నాశ్రయించియుండు ధనవంతులకును జమీందారులకును బిరుదులుగలవారికిని ప్రజలు వ్యతిరిక్తులై యుండి కాంగ్రెసుకు తోడ్పడినట్లే. అందువలన నిజ