పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/440

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

416

బ్రిటిష్ రాజ్యతంత్రయుగము


ఏ సైనిక శాసనమునగూడ ఇన్ని నిర్బంధములులేవు. దేశములో నెవ్వరును మాటలాడుటకుగూడ సాహసింపలేనంతటి తీవ్రమైన కఠినచర్యలను తీసికొనిరి. ఇట్లు దేశములో ప్రజాభిప్రాయమును అణచివేసి ప్రజలప్రాతిపదిక - హక్కులను గూడ నాశనము జేసిరి. ఇంకొక అన్యాయ మేమసగా కాంగ్రెసునారు జైళ్ళలో మ్రగ్గుచుండగా శాసనసభలందు ప్రవేశించియున్న బ్రిటిషుప్రభుభక్తి పరులు, విల్లింగ్డన్ ప్రభువు చెప్పిన ఆర్డి నెన్సుల నెల్ల శాసనములుగా జేసిరి. ఇట్లు తీవ్ర నిర్బంధ విధానముచేత దేశప్రజలను అణచియుంచి దేశములోని రాజకీయరంగము నొక మహాశ్మశానముగాజేసి దీనికి శాంతి యని విల్లింగ్డను ప్రభువు పేరిడెను. కాంగ్రెసు మరల లేవలేకుండ అణచివేసితిననియు, ఇక నీదేశమున బ్రిటిషుపరిపాలనమున కెదురుదిరుగ సాహసించువారెవ్వరు నుండరనియు, బ్రిటిషు సామ్రాజ్య ప్రభుత్వమువారికి నచ్చజెప్పెను. ఇట్లొకవంక ప్రజల స్వాతంత్ర్య స్వత్వము లెల్ల హరించి ఇంకొకవంక దేశప్రభుత్వమున రాజ్యాంగ సంస్కరణములను గూర్చిన విచారణల నింకను జరిపెదమని చెప్పి మరల మూడవమారు ఇంకొక రౌండుటేబిలుసభను జేసి బ్రిటీషు ప్రభుభక్తిపరులను గొందరను మరల దాని కాహ్వానించిరి. ఈ చర్చలకును ఆలోచనలకును అంతము కనబడుటలేదు. ఇందువలన గలుగు ఫలితమును గనబడుటలేదు. ఎట్టకేలకు 1933 సంవత్సరము మార్చిలో తాము చేయదలచిన రాజ్యాంగ సంస్కరణములను గూర్చిన చిత్తుచట్టమును పార్లమెంటులో ప్రవేశపెట్టగలందులకు ముందు గాబ్రిటిషుప్రభుత్వమువారొక